త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Silver Prices | రూ.4 లక్షల నుంచి రూ.1.69 లక్షలకు పడిపోయిన వెండి ధర.. భారీ పతనానికి కారణాలివే..

Silver Prices | ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా కిలో వెండి ధర రూ.4 లక్షల మార్కును దాటగా, ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో రూ.1.69 లక్షలకు పడిపోయింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, డాలర్ బలోపేతం, ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వెండి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి ధరలు 52 వారాల కనిష్ఠానికి చేరుకున్నాయి.

S

Business | Published On Nov 16, 2026, 5.39 pm IST

Silver Prices | రూ.4 లక్షల నుంచి రూ.1.69 లక్షలకు పడిపోయిన వెండి ధర.. భారీ పతనానికి కారణాలివే..
Advertisement

Silver Prices | ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా కిలో వెండి ధర రూ.4 లక్షల మార్కును దాటగా, ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో రూ.1.69 లక్షలకు పడిపోయింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, డాలర్ బలోపేతం, ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వెండి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి ధరలు 52 వారాల కనిష్ఠానికి చేరుకున్నాయి.

వెండి ధ‌ర‌లు ఎందుకు త‌గ్గుతున్నాయి..?

వెండి ధరలు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్)లో డిసెంబర్ ఫ్యూచర్స్ వెండి ధర జనవరిలో కిలోకు రూ.4 లక్షల స్థాయిని దాటగా, ప్రస్తుతం రూ.1.69 లక్షలకు పడిపోయింది. అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా వెండిపై భారీగా పెట్టుబడులు రావడంతో జనవరిలో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడడం, పారిశ్రామిక అవసరాల కోసం వెండికి డిమాండ్ తగ్గడం ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ వెండి ఫ్యూచర్స్ సోమవారం 52 వారాల కనిష్ఠానికి చేరుకుని, ఔన్సుకు 47.22 డాలర్ల వద్ద దాదాపు 4 శాతం నష్టంతో ట్రేడయ్యాయి.

కీల‌క స్థాయిలు ఇవే..

ఇంటర్నేషనల్ రికార్డు గరిష్ఠాల నుంచి వెండి ధరలు దాదాపు 60 శాతం దిద్దుబాటుకు గురయ్యాయని ఇండస్ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు. అమెరికా డాలర్ బలోపేతం, అధిక బాండ్ ఈల్డ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, పారిశ్రామిక డిమాండ్ బలహీనపడడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ అభివృద్ధి రంగంలో మందగమనం, సౌర విద్యుత్ రంగంలో డిమాండ్ తగ్గడం వెండిపై ఒత్తిడి పెంచాయని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో వెండి ధరలపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, డాలర్ కదలికలు, పెట్టుబడుల ప్రవాహాలు కీలక ప్రభావం చూపనున్నాయని తెలిపారు. ఎంసీఎక్స్‌లో కిలో వెండికి రూ.1,55,000 వద్ద కీలక మద్దతు ఉండగా, రూ.1,90,000 తక్షణ నిరోధ స్థాయిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ కామెక్స్ మార్కెట్లో ఔన్సుకు 40 డాలర్లు మద్దతు స్థాయిగా, 55 డాలర్లు నిరోధ స్థాయిగా వివరించారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో త‌గ్గిన డిమాండ్‌..?

మరోవైపు ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ మాట్లాడుతూ.. కామెక్స్ వెండి ధరల్లో 48.50-49 డాలర్ల స్థాయిలో ఉన్న కీలక మద్దతు జోన్ దిగువకు ధరలు పడిపోవడంతో అది ఇప్పుడు నిరోధ స్థాయిగా మారిందని తెలిపారు. ప్రస్తుతం 51-51.50 డాలర్ల వద్ద తదుపరి నిరోధం ఉండగా, దిగువకు 46-46.50 డాలర్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 44-44.50 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందని వివరించారు. వెండి ధరలు తిరిగి 49 డాలర్ల పైన స్థిరంగా కొనసాగితేనే మార్కెట్లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకవేళ 46 డాలర్ల దిగువకు పడిపోతే 44.50 డాలర్ల వరకు మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీర్ఘకాలంలో పారిశ్రామిక అవసరాల కారణంగా వెండికి డిమాండ్ కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ, ధరల్లో స్థిరమైన రికవరీ రావాలంటే పెట్టుబడుల ప్రవాహాలు తిరిగి పెరగడంతోపాటు స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement