త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది న‌మ్మాల్నా.. ఉత్త‌మ్ చెప్పిందా?

MLA Sudheer Reddy | రాష్ట్రంలో నీటి క‌ష్టాలు (Drinking Water) రాబోతున్నాయ‌ని సీఎం రేవంత్ అంటుంటే.. మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డేమో నీటి కొర‌త లేద‌ని చెప్తున్నార‌ని.. ఎవ‌రిని న‌మ్మాలో తెలియ‌డం లేద‌ని ఎల్బీన‌గ‌ర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (MLA Sudheer Reddy) విమ‌ర్శించారు.

S

Flash news | Published On Nov 16, 2026, 5.59 pm IST

MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది న‌మ్మాల్నా.. ఉత్త‌మ్ చెప్పిందా?
Advertisement
  • తాగునీటి విష‌యంలో వాళ్లు అబ‌ద్ధాల‌కు ఎగ‌బ‌డ్డ‌రు
  • మార్చి నెలలో హైదరాబాద్‌లో దారుణమైన పరిస్థితే ఉంట‌ది
  • న‌వంబ‌ర్‌లనే బోర్లు ఎండిపోయిన‌య్‌.. సింగూరు, మంజీర కూడా అంతే
  • హైదరాబాద్‌లో 2 లక్షల 33 వేల ట్యాంకర్ల వరకు వచ్చింది
  • మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

MLA Sudheer Reddy | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో నీటి క‌ష్టాలు (Drinking Water) రాబోతున్నాయ‌ని సీఎం రేవంత్ అంటుంటే.. మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డేమో నీటి కొర‌త లేద‌ని చెప్తున్నార‌ని.. ఎవ‌రిని న‌మ్మాలో తెలియ‌డం లేద‌ని ఎల్బీన‌గ‌ర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (MLA Sudheer Reddy) విమ‌ర్శించారు. సీఎం, మంత్ర‌లు అబ‌ద్ధాల‌కు ఎగ‌బ‌డ్డ‌రన్నారు. హైద‌రాబాద్‌ (Hyderabad)లో న‌వంబ‌ర్‌లోనే బోర్లు ఎండిపోయాయ‌ని.. ఇక వ‌చ్చే మార్చిలో దారుణమైన‌ ప‌రిస్థితులు ఉండ‌బోతున్నాయ‌ని హెచ్చ‌రించారు. ఇప్పుడే 2 లక్షల 33 వేల ట్యాంకర్ల వరకు వచ్చిందన్నారు. సింగూరు, మంజీరా న‌దులు పూర్తిగా ఎండిపోయాయ‌ని చెప్పారు. తెలంగాణ భ‌వన్‌లో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ హ‌యాంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకునేవార‌న్నారు.

కేటీఆర్ ముందే చెప్పారు

హైదరాబాద్ లో నీటి సమస్య లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. మంత్రులు, అధికారులు అబద్ధాలు చెప్తున్నారు. ఎండాకాలం వస్తుందంటే కేసీఆర్ ముందే ఆలోచన చేశారు. హైదరాబాద్ లో నీటి సమస్య వస్తుందని కేటీఆర్ ముందే చెప్పారు. మేడిగడ్డకు వెళ్ళిన మాపై సీఎం పరుష పదజాలంతో మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయిలో అలా మాట్లాడడం మన దురదృష్టం. కృష్ణా జలాలు మూడు విడతల్లో హైదరాబాద్ రావాలి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాబోయే రోజుల్లో కష్టమే.

ఎల్ నినో వస్తుందని తెలిసినా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. రేవంత్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్ ను, బీఆర్ఎస్ తిట్టడమే సరిపోతుంది. కూకట్ పల్లి నియోజకవర్గంలో నీటి వినియోగం పెరిగింది. మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం. తీవ్రమైన వాటర్ సమస్య ఉందని జలమండలి ముందు బీఆర్ఎస్ ధర్నా చేసింది.
నీటి సమస్య రాకుండా ప్రణాళికలు చేస్తున్నామని అధికారులు చెప్పారు.

రేవంతే ఫోన్లు ట్యాప్ చేస్తుండు

నవంబర్ నెలలోనే హైదరాబాద్ లో నీటి సమస్య మరింత పెరిగింది. హైదరాబాద్ లో నీటి సమస్య ఉంటే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారా..? గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన వారికి ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ నిర్మించిన
STPల ద్వారా గ్రీన్ వాటర్ ను పరిశ్రమలకు అమ్ముకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రేవంత్ రెడ్డి టైం పాసు రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ ఎవరి ఫోన్లు ట్యాప్ చేయ‌లేదు. బీఆర్ఎస్ నాయకుల ఫోన్లే రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు అని సుధీర్‌రెడ్డి ఆరోపించారు.

Advertisement
Advertisement