Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర
Kavitha | జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వారాహి పేరుతో యాత్ర చేస్తే.. తాను ‘బైరవ’ యాత్ర (Bhairava Yatra) పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) పేర్కొన్నారు.
- పాంచజన్య సంకల్పం కోసం ప్రజల్లోకి వెళ్లబోతున్నం
- ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం సరైంది కాదు
- రేవంత్ ప్రధానిని కలిసి కరువుపై మాట్లాడకపోవడం అన్యాయం
- హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేలేదాకా ఫైట్ చేస్తం
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
Kavitha | త్రినేత్ర న్యూస్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వారాహి పేరుతో యాత్ర చేస్తే.. తాను ‘భైరవ’ యాత్ర (Bhairava Yatra) పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) పేర్కొన్నారు. పాంచజన్య సంకల్పంలో భాగంగా బైరవ వాహనంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామన్నారు. నిరుద్యోగులను మోసం చేసి కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించని కాంగ్రెస్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని కోరారు. మోదీని కలిసిన సీఎం రేవంత్ కరువుపై మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి హరీష్ రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల మరోసారి డిమాండ్ చేశారు. ఆయన చేసిన అవినీతిపై ప్రజాక్షేత్రంలో కొట్లాడటంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాల ద్వారా పోరాటం చేస్తామని చెప్పారు. హరీష్ రావు అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలను సీబీసీఐడీకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు కూడా పంపిస్తామని చెప్పారు. తప్పు చేసిన వారెవరైనా సరే కచ్చితంగా వారికి శిక్ష పడాలన్నదే తమ విధానమన్నారు.
సాయం కోరాలన్న సోయీ లేదు
ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత మండిపడ్డారు. నిన్న ప్రధాని మోడీని కలిసిన ఆయన కనీసం ఈ అంశంపై మాట్లాడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో కరువు, రైతుల బాధలు, పంటల పరిస్థితిని ప్రధానికి వివరించి సాయం కోరాలన్న సోయి కూడా సీఎంకు లేదన్నారు. పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లు గురించి కూడా ప్రధానితో ప్రస్తావించకపోవటం అన్యాయమని ధ్వజమెత్తారు. ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కన పెట్టి కేవలం కాంట్రాక్ట్ లు, కమీషన్ల గురించి మాట్లాడుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణ వచ్చిన తర్వాత గానీ రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని చెప్పారు. పంటలు వేయకపోతే రైతులకు ఏం పరిహారం ఇస్తారో చెప్పాలన్నారు. ఎకరాకు రూ. 25 వేలు పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇంటర్ రద్దుపై రౌండ్ టేబుల్ మీటింగ్
తమ పార్టీ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందాలన్న సంకల్పంతో ఉందని, అదే విధంగా సామాజిక న్యాయం ప్రతి వర్గానికి అందాలన్నదే తమ అభిమతమని చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసి కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించని కాంగ్రెస్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని కోరారు. ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ లు కాంగ్రెస్ ను ప్రశ్నించకుండా కాలం వెళ్లదీస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్య శక్తి ని నింపేలా తాము కృషి చేస్తున్నామని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఇంటర్మీడియేట్ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని.. దానిపై మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు.
తాజావార్తలు
- ●Telangana Indiramma Houses | 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి
- ●Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!
- ●MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?
- ●Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?
- ●Teja Sajja | సందడిగా తేజా సజ్జా ఎంగేజ్మెంట్ - కాబోయే భార్య పేరు చెప్పేసిన హనుమాన్ హీరో
- ●Silver Prices | రూ.4 లక్షల నుంచి రూ.1.69 లక్షలకు పడిపోయిన వెండి ధర.. భారీ పతనానికి కారణాలివే..

Telangana Indiramma Houses | 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి

Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!

MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?

Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?




