Allu Arjun | అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలా? – ఐకాన్ స్టార్ టీమ్ క్లారిటీ
అల్లు అర్జున్‌ను కలవాలంటే నలభై రెండు రూల్స్ పాటించాలని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా చేసిన కామెంట్లపై బన్నీ టీమ్ రియాక్ట్ అయ్యింది. ఆ కామెంట్లు నిరాధారమైనవని అన్నారు. అసత్యపు ఆరోపణలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.
Entertainment | Published On Feb 10, 2026, 6.41 pm IST
Allu Arjun | అల్లు అర్జున్‌ను కలవాలంటే నలభై రెండు రూల్స్ పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌తో పాటు సౌత్ హీరోలతో యాడ్ షూట్ ఎక్స్‌పీరియన్స్ గురించి కావేరీ బారువా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సరదాగా ఉంటారు...
యాడ్ షూటింగ్‌లలో బాలీవుడ్ హీరోలు చాలా సరదాగా ఉంటారని, తాము సెలిబ్రిటీలమనే భావన వారిలో అస్సలు కనిపించదని కావేరి బారువా అన్నది. అదే దక్షిణాది హీరోల విషయంలో కఠినమైన నిబంధనలు ఉంటాయని కావేరి చెప్పింది. అల్లు అర్జున్‌తో షూటింగ్ అంటే ఆయన్ని కలినప్పుడు ఎలా ఉండాలి? సెట్స్‌లో బన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలన్నది ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిందేనని కావేరి బారువా పేర్కొన్నది.
42 రెండు రూల్స్...
"అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు ఆయన మేనేజర్లు 42 రూల్స్‌తో కూడిన ఓ నోట్‌ను మాకు పంపించారు. బన్నీ కళ్లల్లోకి కళ్లుపెట్టి చూడకూడదు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. హీరోకు తగిన దూరం పాటించాలి అంటూ చాలానే నిబంధనలు విధించారు. బన్నీ సెట్స్‌లో ఉండగా ఎవరూ ఫోన్ ఉపయోగించకూడదు. ఆ విషయం తెలియక ఓ యాడ్ షూట్ లో నేను ఫోన్ ఉపయోగిస్తూ కుర్చున్నా...అప్పుడే బన్నీ సెట్స్‌లోకి వస్తున్నారు. అందరి కంటే వెనకాల కూర్చొని నేను ఫోన్ చూస్తున్నాను. అయినా సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలోని ఫోన్ లాక్కున్నారు" అంటూ కావేరి బారువా చెప్పింది. బ్రాండ్ స్ట్రాటజర్ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
ప్రెసిడెంట్ కంటే ఎక్కువ...
ఇండియన్ ప్రెసిడెంట్ కలవడానికి కూడా అన్ని ప్రోటోకాల్స్ ఉండవంటూ నెటిజన్లు బన్నీని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి బన్నీపై కావాలనే కావేరి బారువా నెగెటివ్ కామెంట్స్ చేస్తోందని చెబుతోన్నారు.
చట్ట ప్రకారం చర్యలు...
తాజాగా కావేరి బారువా కామెంట్లపై అల్లు అర్జున్ టీమ్ రియాక్ట్ అయ్యారు. కావేరి బారువా ఆరోపణలన్నీ అసత్యాలేనని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి వినిపిస్తోన్న కామెంట్లలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. "సినిమా, యాడ్ భేదాలు లేకుండా షూటింగ్ ఏదైనా సెట్స్‌లో అందరిని గౌరవిస్తుంటారు. చాలా హుందాగా ఉంటారు. ఇలాంటి నిరాధారమైన వార్తలతో ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచాలని ప్రయత్నించిన వారిపై చట్ట ప్రకారం చర్యలను తీసుకోబోతున్నాం. పరువునష్టం దావా వేయబోతున్నాం" అని తెలిపారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



