Allu Arjun | మైండ్‌బ్లోయింగ్ మూవీ – రామ్‌చరణ్ అదరగొట్టేశాడు – పెద్ది మూవీకి అల్లు అర్జున్ రివ్యూ
రామ్‌చరణ్ పెద్ది మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. రామ్‌చరణ్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని, రా అండ్ రస్టిక్ రోల్‌లో చరణ్ జీవించాడని బన్నీ అన్నాడు. చరణ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ పోస్ట్ పెట్టాడు. పెద్ది మూవీకి బన్నీ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 9, 2026, 11.54 am IST
Allu Arjun | రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు. రామ్‌చరణ్ యాక్టింగ్ మైండ్‌బ్లోయింగ్ అని, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్సుల్లో అదరగొట్టేశాడని బన్నీ అన్నాడు. "పెద్ది మూవీని నిన్న నైట్ చూశా. రామ్‌చరణ్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. రా అండ్ రస్టిక్ రోల్‌లో జీవించాడు. అతడి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్ బాగున్నాయి. ప్రతి అంశంలో రామ్ చరణ్ మెప్పించాడు. చరణ్‌ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. పెద్ది మూవీకి వస్తోన్న ప్రశంసలకు రామ్‌చరణ్ పూర్తిగా అర్హుడు. జగపతిబాబుతో పాటు మిగిలిన యాక్టర్ల నటన అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్‌కు అభినందనలు. మంచి పాయింట్‌తో దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కించారు. చరణ్‌ను నెక్స్ట్ లెవెల్‌లో చూపించాడు. ప్రతి పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దాడు. టెక్నీషియన్లు, నిర్మాతతో పాటు పెద్ది టీమ్ అందరికి నా అభినందనలు" అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
బన్నీ పోస్ట్ వైరల్
పెద్ది సినిమాకు టాలీవుడ్ హీరోలెవరూ సపోర్ట్ చేయడం లేదంటూ ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో పెద్ది సినిమాపై బన్నీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.
300 కోట్ల వసూళ్లు...
పెద్ది మూవీలో జాన్వీ కపూర్ రోల్‌పై దారుణంగా విమర్శలు వస్తోన్నాయి. ఈ వివాదం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు పాకింది. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గా చూపించే తీరుపై సెలిబ్రిటీలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలతో సంబంధం లేకుండా పెద్ది మూవీ ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌ను స్కిప్ చేసిన జాన్వీ – అచ్చియమ్మ పేరు ఎత్తని చరణ్
జూన్ 8, 2026

Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌కు ముహూర్తం ఫిక్స్ – అందరి ఫోకస్ అచ్చియమ్మపైనే …
జూన్ 8, 2026

Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌పై విమర్శలు.. బాలీవుడ్ నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్..!
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..
- ●Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్
- ●Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..
- ●Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు

Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..

Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్



