Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ – టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!
టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్ అరుదైన ఘనతను సాధించారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో వీరిద్దరు చోటు దక్కించుకున్నారు. అల్లు అర్జున్ ఫొటోతో ఫోర్బ్స్ ఇండియా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఈ కవర్ పేజీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Aug 27, 2026, 12.51 pm IST
Tollywood | టాలీవుడ్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అరుదైన ఘనతను సాధించారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో ఈ టాలీవుడ్ హీరోలు ఇద్దరూ చోటు దక్కించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ జాబితాలో వీరిద్దరే నిలవడం గమనార్హం.
అల్లు అర్జున్ ఫొటోతో ఫోర్బ్స్ ఇండియా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఈ కవర్ పేజీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2000 కోట్ల వసూళ్లు...
పుష్ప, పుష్ప 2 బ్లాక్‌బస్టర్స్‌తో బన్నీ పేరు పాన్ ఇండియన్ లెవెల్‌లో మారుమోగింది. పుష్ప 2 హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న డబ్బింగ్ మూవీగా నిలిచింది. స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా ఏకంగా ఎనిమిది వందల కోట్ల వసూళ్లను దక్కించుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 2000 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. పుష్ప 2 బ్లాక్‌బస్టర్‌తో బన్నీ స్టార్‌డమ్ రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఇరవై ఐదు వరకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అతడు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
అట్లీతో రాకా...
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో రాకా సినిమా చేస్తోన్నాడు అల్లు అర్జున్. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పడుకోణ్‌తో పాటు రష్మిక మందన్న, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1300 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. రాకా షూటింగ్ పూర్తికాకముందే లోకేష్ కనగరాజ్‌తో ఓ సూపర్ హీరో మూవీకి బన్నీ ఓకే చెప్పాడు.
పెద్ది తర్వాత సుకుమార్...
ఇటీవలే పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రామ్‌చరణ్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఇందులో పెద్ది అనే క్రాస్ ఓవర్ అథ్లెట్ పాత్రలో రామ్‌చరణ్ అసమాన నటనను కనబరిచాడు. యాక్టింగ్ పరంగా రామ్‌చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా పెద్ది నిలిచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. పెద్ది తర్వాత సుకుమార్‌తో ఓ మూవీకి రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు
- ●Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"
- ●ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..
- ●WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
- ●Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం... వీడియోలు

Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు

Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"

ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..

WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..





