త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు … సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్‌

తాత అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ గుడ్‌న్యూస్‌ను అభిమానుల‌కు వినిపించాడు. హైద‌రాబాద్‌లో సొంతంగా ఓ ఆఫీస్ ఓపెన్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ ఆఫీస్‌కు ఐకాంజ అనే పేరు పెట్టాడు. గీతా ఆర్ట్స్ ఉండ‌గానే హైద‌రాబాద్‌లో బ‌న్నీ మ‌రో ఆఫీస్ ప్రారంభించ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Oct 1, 2026, 5.33 pm IST

Allu Arjun |  గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు … సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్‌
Advertisement

Allu Arjun | లెజెండ‌రీ న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా అభిమానుల‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ గుడ్‌న్యూస్ వినిపించాడు. హైద‌రాబాద్‌లో సొంతంగా ఓ ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఈ ఆఫీస్ పేరుతో పాటు ప్రారంభోత్స‌వ వేడుక తాలూకు ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నాడు.

ఐకాంజ‌...

ఈ కొత్త ఆఫీస్‌కు ఐకాంజ అనే పేరును పెట్టిన‌ట్లు అల్లు అర్జున్ చెప్పాడు. ప్రారంభోత్స‌వ వేడుక‌లో అల్లు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ పాల్గొన్నారు. ఆఫీస్ ఓపెనింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న అల్లు అర్జున్... కొత్త ఆఫీస్‌... కొత్త అధ్యాయం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అధునాత‌న సౌక‌ర్యాల‌తో...

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అధునాత‌న సౌక‌ర్యాల‌తో అల్లు అర్జున్ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా ప్ర‌త్యేకంగా ఆఫీస్‌ను డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం. స్టార్ హీరోల సినిమాల ఆఫీస్‌ల‌ను త‌ల‌ద‌న్నేలా భారీ వ్య‌యంతో నిర్మించిన‌ట్లు తెలిసింది. త‌న సూప‌ర్‌హిట్‌ సినిమాల‌ ప్ర‌యాణానికి సంబంధించిన జ్ఞాప‌కాలు, మైల్‌స్టోన్స్‌, అవార్డులు, కుటుంబంతో పాటు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ఫొటోల‌తో ప్ర‌తి రూమ్‌ను డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం.

గీతా ఆర్ట్స్ ఉండ‌గానే...

గీతా ఆర్ట్స్ సంస్థ ఉండ‌గానే అల్లు అర్జున్ సొంతంగా హైద‌రాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేయ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక నుంచి గీతా ఆర్ట్స్‌లో కాకుండా త‌న సినిమాల‌కు సంబంధించిన స్టోరీ సిట్టింగ్స్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో పాటు ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను ఐకాంజ నుంచే అల్లు అర్జున్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Advertisement
Advertisement