త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allari Naresh | భ‌క్తి క‌థ‌తో క‌న‌క‌దుర్గ – అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా కాజ‌ల్

హిట్టు కోసం వెయిటింగ్‌లో ఉన్న అల్ల‌రి న‌రేష్ ఫ‌స్ట్ టైమ్ భ‌క్తి క‌థ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. క‌న‌క‌దుర్గ పేరుతో మొద‌లైన ఈ సినిమాకు ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భ‌క్తి సినిమాలో అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా మిస్ బీహార్ కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On Apr 7, 2026, 3.58 pm IST

Allari Naresh |  భ‌క్తి క‌థ‌తో క‌న‌క‌దుర్గ – అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా కాజ‌ల్
Advertisement

Allari Naresh | అల్ల‌రి న‌రేష్ సినిమా అంటే ఒక‌ప్పుడు మినిమం గ్యారెంటీ అనే న‌మ్మ‌కం ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో ఉండేది. కామెడీ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు.. క‌థ‌ల ఎంపిక‌లో పొర‌పాట్ల కార‌ణంగా గ‌త కొన్నేళ్లుగా అల్ల‌రి న‌రేష్ జోరు త‌గ్గింది. మూస ధోర‌ణి నుంచి బ‌య‌ట‌ప‌డి ఇటీవ‌ల కొన్ని ప్ర‌యోగాలు చేసిన విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు. తాజాగా హిట్టు కోసం వెయిటింగ్‌లో ఉన్న అల్ల‌రి న‌రేష్ ఫ‌స్ట్ టైమ్ భ‌క్తి క‌థ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

క‌న‌క‌దుర్గ‌...

క‌న‌క‌దుర్గ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. క‌న‌క‌దుర్గ లాంఛింగ్ ఈవెంట్‌కు చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ కొణిదెల‌తో పాటు నిర్మాత అల్లు అర‌వింద్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

కాజ‌ల్ చౌద‌రి...

క‌న‌క‌దుర్గ సినిమాకు ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ మూవీలో అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. సుబ్బ‌రాజు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ర‌చ‌యిత బీవీఎస్ ర‌వి ఈ సినిమాకు క‌థ‌ను అందిస్తూ నిర్మిస్తున్నారు.భార‌తీయ పురాణాల నేప‌థ్యంలో భక్తి, యాక్షన్, భావోద్వేగాల క‌ల‌బోత‌గా క‌న‌క‌దుర్గ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘ భక్తి గురించి మాత్రమే కాకుండా..జీవితంలో అన్ని కోల్పోయిన‌ ఒక మనిషి, తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కోవ‌డానికి దారితీసిన ప‌రిస్థితులేమిట‌నే పాయింట్‌తో స‌రికొత్త‌గా ఈ సినిమా ఉంటుంది. గ‌త సినిమాల‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో అల్ల‌రి న‌రేష్ క‌నిపించ‌బోతున్నారు. విజువ‌ల్‌గానే కాకుండా ఎమోష‌న‌ల్‌గా కూడా గ్రాండ్‌గా క‌న‌క‌దుర్గ ఉండ‌బోతుంది" అని అన్నారు.
కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తున్న సెకండ్ తెలుగు మూవీ ఇది. మిస్ బీహార్‌గా ఎంపికైన కాజ‌ల్ చౌద‌రి సుమంత్ అన‌గ‌న‌గాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

Advertisement
Advertisement