Alia Bhatt | కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో అలియా భట్ – నిమిషానికి కోటి రెమ్యూనరేషన్?
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ హారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలియా భట్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ తుంబాద్‌కు సీక్వెల్ రాబోతుంది. తుంబాద్ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అలియా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా కోసం అలియా భట్ తీసుకున్న రెమ్యూనరేషన్ బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Jul 14, 2026, 3.33 pm IST
Alia Bhatt | హారర్ జానర్ అంటేనే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం స్టార్స్‌లో కనిపిస్తుంటుంది. వరుప ఫ్లాపుల్లో ఉన్న చాలా మంది హీరోహీరోయిన్లు కమ్‌బ్యాక్ కోసం హారర్ కథాంశాలను ఎంచుకుంటుంటారు. ఈ లిస్ట్‌లో అలియా భట్ కూడా చేరిపోయింది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ హారర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అది కూడా ఓ సీక్వెల్ సినిమా కావడం గమనార్హం.
కల్ట్ క్లాసిక్...
సోహమ్ షా హీరోగా రాహి అనిల్ బావ్రే దర్శకత్వంలో రూపొందిన హారర్ మూవీ తుంబాద్ హిందీలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అరవై కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. ఫస్ట్ రిలీజ్‌లో కేవలం పదిహేను కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ రీ రిలీజ్‌లో మాత్రం నలభై ఐదు కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది.
సీక్వెల్‌లో...
తుంబాద్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. తొలి పార్ట్‌లో హీరోగా నటించిన సోహమ్ షాతో పాటు నవాజుద్దీన్ సిద్ధికీ తుంబాద్ 2లో హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ జాయినైంది. ఈ హారర్ మూవీలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలియా భట్‌తో దిగిన ఓ ఫొటోను సోహమ్ షా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటో వైరల్ అవుతోంది. తుంబాద్ ప్రపంచంలో భాగం కావడం ఆనందంతో పాటు ఎగ్జైటింగ్‌గా ఉందంటూ అలియా భట్ ప్రకటించింది.
గెస్ట్ రోల్‌లో...
కాగా తుంబాద్ 2లో అలియా భట్ ఎక్కువ నిడివితో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఆమె పాత్ర పది హేను నిమిషాల వరకు కనిపిస్తుందట. కథను మలపుతిప్పే ఓ కీలక రోల్ అని సమాచారం. కాగా ఈ పది నిమిషాల పాత్ర కోసం అలియా భట్ పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిమిషానికి కోటి రూపాయలు డిమాండ్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలియా భట్‌కు ఉన్న క్రేజ్, స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత మొత్తాన్ని మేకర్స్ షూటింగ్‌లో అడుగుపెట్టడానికి ముందే ఇచ్చేశారట. వచ్చే ఏడాది డిసెంబర్ 3న తుంబాద్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఫస్ట్ స్పై లేడీ ఓరియెంటెడ్ మూవీ...
ఇటీవలే అల్ఫా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అలియా భట్. బాలీవుడ్‌లో ఫస్ట్ స్పై లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన అల్ఫా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అతి కష్టంగా 90 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. శార్వరి మరో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా కనిపించాడు. ప్రస్తుతం భర్త రణభీర్ కపూర్‌తో కలిసి లవ్ అండ్ వార్ సినిమా చేస్తోంది అలియా భట్. సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | ఎస్ఎస్ఎస్ – శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!
జులై 13, 2026

Deepika Padukone | సినిమాలకు బ్రేక్ – దీపికా పడుకోణ్ కోసం రణ్‌వీర్‌సింగ్ నిర్ణయం
జులై 13, 2026

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
జులై 12, 2026
తాజావార్తలు
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - టీవీకే పార్టీ ప్రత్యర్థి నిర్మాత - కోలీవుడ్‌లో కొత్త రూమర్?
- ●DSC Notification | 15 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయండి.. నిరుద్యోగుల డిమాండ్
- ●SIR | తెలంగాణలో 'సర్' గడువు పొడిగించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
- ●Private Schools | అడ్డగోలుగా వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
- ●Bharat Future City | భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్.. 15న సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●Manideep Reddy Missing | ఫిన్లాండ్లో దొరికిన మృతదేహం మనిదీప్దేనా? డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ జైశంకర్‌కు దత్తాత్రేయ లేఖ!

Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - టీవీకే పార్టీ ప్రత్యర్థి నిర్మాత - కోలీవుడ్‌లో కొత్త రూమర్?

DSC Notification | 15 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయండి.. నిరుద్యోగుల డిమాండ్

SIR | తెలంగాణలో 'సర్' గడువు పొడిగించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి

Private Schools | అడ్డగోలుగా వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు



