Alia Bhatt | అలియాభట్ బాలీవుడ్ మూవీకి రిలీజ్ కష్టాలు – మూడోసారి వాయిదా
అలియాభట్ బాలీవుడ్ మూవీ ఆల్ఫాకు రిలీజ్ కష్టాలు తప్పడం లేదు. మూడో సారి ఈ సినిమా వాయిదాపడింది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఫస్ట్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ స్పై మూవీ జూన్‌కు షిప్టయ్యింది.
Entertainment | Published On Mar 9, 2026, 1.18 pm IST
Alia Bhatt | అలియాభట్ బాలీవుడ్ మూవీ ఆల్ఫా మరోసారి పోస్ట్‌పోన్ అయ్యింది. ఇండియన్ స్క్రీన్‌పై ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ స్పై యాక్షన్ మూవీగా ఆల్ఫా తెరకెక్కుతోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ సోమవారం రివీల్ చేశారు. జూలై 10న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.
రిలీజ్ వాయిదా...
తొలుత ఆల్ఫా సినిమాను గత ఏడాది డిసెంబర్‌లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదాపడింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో అలియాభట్ సినిమా విడుదల కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవి పుకార్లుగానే మిగిలాయి. ఏప్రిల్‌లో తప్పకుండా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యింది. ఏప్రిల్ నుంచి జూలైకి వెళ్లిపోయింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరక్కపోవడం వల్లే మేకర్స్ జూలైకి పోస్ట్‌పోన్ చేశారని అంటున్నారు. మూడోసారి వాయిదాపడటంతో ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ డైరెక్ట్ స్ట్రీమింగ్ కోసం 215 కోట్లకు ఆల్ఫా సినిమాను కొనడానికి ముందుకొచ్చినట్లు ప్రచారం జరిగుతోంది.
అలియాతో పాటు...
అల్ఫా మూవీకి శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అలియాభట్‌తో పాటు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శార్వరీ వాఘ్ మరో నాయికగా కనిపించబోతున్నది. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లోభాగంగా ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో సల్మాన్ ఖాన్ (టైగర్), షారుఖ్ ఖాన్ (పఠాన్), హృతిక్ రోషన్ (కబీర్) స్పై పాత్రల్లో అదరగొట్టారు. కానీ ఫస్ట్ టైమ్ ఉమెన్ స్పై కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అలియా, శార్వరీ సూపర్ ఏజెంట్స్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.
గెస్ట్ రోల్స్...
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కథాంశంతో అలియా భట్ చేస్తోన్న ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం కావడం గమనార్హం. దేశభద్రత కోసం ఇద్దరూ లేడీ ఏజెంట్స్ ఓ సీక్రెట్ మిషన్‌ను ఎలా సక్సెస్‌ఫుల్ కంప్లీట్ చేశారనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఇందులో హృతిక్‌రోషన్‌తో పాటు యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో నటించిన హీరోలందరూ గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



