Trivikram | త్రివిక్రమ్ పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన సునీల్ – జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో రిలీజ్
జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు డైరెక్టర్ త్రివిక్రమ్, కమెడియన్ సునీల్ గెస్ట్‌లుగా రాబోతున్నారు. వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోమవారం రిలీజైంది. ఈ ప్రోమోలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు పంజాగుట్టలో ఒకే రూమ్‌లో ఉన్న జ్ఞాపకాలను ఇద్దరు గుర్తుచేసుకున్నారు. అక్టోబర్ 23న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Oct 19, 2026, 9.16 pm IST
Trivikram |డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రాణ స్నేహితుల్లో కమెడియన్ సునీల్ ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఒకే రూమ్‌లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించారు. త్రివిక్రమ్ అసిస్టెంట్ రైటర్‌గా కెరీర్ మొదలుపెట్టి టాప్ డైరెక్టర్‌గా మారాడు. సునీల్ తెలుగులో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కూడా సినిమాలు చేశాడు. ఈ ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిసి అభిమానుల ముందుకు రాబోతుంది. జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ సెకండ్ సీజన్‌లో రెండో ఎపిసోడ్‌కు త్రివిక్రమ్, సునీల్ గెస్ట్‌లుగా రాబోతున్నారు. వీరి ఎపిసోడ్ తాలూకు ప్రోమోను జీ5 ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో త్రివిక్రమ్, సునీల్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించాడు.
పంజాగుట్ట రూమ్...
ఈ ప్రోమోలో తొలినాళ్లలో పంజాగుట్టలో ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉన్న రోజులను త్రివిక్రమ్, సునీల్ గుర్తుచేసుకున్నారు. అప్పటి అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ తమ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లుగా ఈ ప్రోమోలో కనిపిస్తోంది.
లవ్ ప్లెస్ అరెంజ్‌డ్...
త్రివిక్రమ్ పెళ్లి ప్రస్తావన రాగానే... సునీల్ సరదాగా తనది లవ్ ప్లస్ అరెంజ్‌డ్ ...నాది అరెంజ్‌డ్ ప్లస్ లవ్ అంటూ నవ్వులు పూయించారు. పెళ్లి అయిన తర్వాత లవ్ పోయిందని చెబుతున్నావా అంటూ సునీల్‌పై సరదాగా ఫైర్ అయ్యారు త్రివిక్రమ్. ఇలా ఒకరిపై మరొకరు పంచ్‌లు వేసుకుంటూ, తమ మధ్య ఉన్న స్నేహాన్ని బయటపెట్టారు.
తమన్ ఎంట్రీ...
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎంట్రీతో డిస్కషన్ సినిమాల వైపు మళ్లింది. అరవింద సమేత పాట విషయంలో తాను పడిన టెన్షన్‌ను తమన్ బయటపెట్టారు. నువ్వు అద్భుతం చేద్దామని ఏం చేయట్లేదు. నువ్వు ఏదో ఒకటి చేయి దానిని మనమే అద్భుతం చేద్దామని త్రివిక్రమ్ తనతో అన్నారని తమన్ గుర్తుచేసుకున్నారు. వేటూరి, సిరివెన్నెలతో త్రివిక్రమ్ కంపేర్ చేయడం గురించి కూడా ఈ ఎపిసోడ్‌లో చర్చించినట్లు ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 23న జీ5 ఓటీటీలో జయమ్ము నిశ్చయమ్మురా సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి – జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
అక్టోబర్ 13, 2026

Aadarsha Kutumbam Postpone | వెంకటేష్ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా – అక్టోబర్ రేసు నుంచి ఔట్?
అక్టోబర్ 5, 2026

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ – 400 కోట్ల కలెక్షన్స్ – తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Dasara | చెడుపై మంచి.. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక దసరా : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Uttam Kumar Reddy | 14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక
- ●Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంకర్ - అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్
- ●Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ
- ●Hyderabad GCC Hub 2026 | రాష్ట్రానికి జీసీసీల వెల్లువ.. గ్లోబల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ
- ●Bathukamma | లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు

Dasara | చెడుపై మంచి.. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక దసరా : సీఎం రేవంత్‌రెడ్డి

Uttam Kumar Reddy | 14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక

Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంకర్ - అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్

Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ



