త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | మైథ‌లాజిక‌ల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ క‌మెడియ‌న్

టాలీవుడ్ క‌మెడియ‌న్ రంగ‌స్థ‌లం మ‌హేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఓ మైథ‌లాజిక‌ల్ మూవీ చేస్తున్నాడు. శివాల‌యం అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సోమ‌వారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది.

N

Entertainment | Published On Aug 24, 2026, 4.11 pm IST

Tollywood | మైథ‌లాజిక‌ల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ క‌మెడియ‌న్
Advertisement

Tollywood | టాలీవుడ్ క‌మెడియ‌న్ రంగ‌స్థ‌లం మ‌హేష్ మైథ‌లాజిక‌ల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శివాల‌యం అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో కాంచ‌న దీప్తిరెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తోంది. వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

శివుడి మ‌హిమ‌ల‌తో...

శివుడి మ‌హిమ‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ తెలుగు మూవీ సోమ‌వారం లాంఛ్ అయ్యింది. భ‌క్తి క‌థ‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, ల‌వ్‌స్టోరీని జోడించి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు ద‌ర్శ‌కుడు వెల్ల‌డించాడు. ఆరు నెల‌లు ఎంతో రీసెర్చ్ చేసి ఈ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు చెప్పారు. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు పేర్కొన్నారు.

జ‌బ‌ర్ధ‌స్థ్‌తో....

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో రంగ‌స్థ‌లం మ‌హేష్ కెరీర్ మొద‌లైంది. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లంలో రామ్‌చ‌ర‌ణ్ స్నేహితుడిగా క‌నిపించాడు. ఈ సినిమా అత‌డికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రంగ‌స్థ‌లం అత‌డి ఇంటి పేరుగా మారిపోయింది. తండేల్‌, ల‌క్కీ భాస్క‌ర్‌, మ‌హాన‌టి, సీతారామం, జాతిర‌త్నాలుతో పాటు ప‌లు తెలుగు సినిమాలు క‌మెడియ‌న్‌గా మ‌హేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 

Advertisement
Advertisement