One Nation – One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
One Nation - One Election | వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వ నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) కీలక అప్డేట్ ఇచ్చింది.
One Nation - One Election | త్రినేత్ర.న్యూస్ : వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వ నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) కీలక అప్డేట్ ఇచ్చింది. 2029లోనే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల నిర్వహణపై ఆయా వర్గాలను సంప్రదించగా, వారిలో 99 శాతం మంది జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నట్లు జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి వెల్లడించారు. దీంతో 2034 కంటే ముందుగానే 2029లోనే జమిలి ఎన్నికలకు వెళ్లే ఆస్కారముందని చెప్పారు.
అయితే, జమిలి ఎన్నికల అమలు అంత సులభం కాదు. దీనికోసం రాజ్యాంగంలోని పలు అధికరణలను సవరించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా అవసరం. ప్రస్తుతం వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని కొన్నింటికి తగ్గించడం, మరికొన్నింటికి పెంచడం వంటి క్లిష్టమైన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ఈ విధానం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను తగ్గిస్తుందని పలు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ తీవ్రతరమైంది.
తాజావార్తలు
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
- ●KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న






