త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhanda 2 | అఖండ 2 మేక‌ర్స్ భారీ షాక్ – బెనిఫిట్ షోలు క్యాన్సిల్

Akhanda 2 అఖండ 2 మేక‌ర్స్‌కు మ‌రో షాక్ త‌గిలింది. టికెట్ రేట్ల పెంపు జీవోతో పాటు బెనిఫిట్ షోల‌ను హైకోర్టు క్యాన్సిల్ చేసింది. కోర్టు తీర్పు తో మ‌రోసారి అఖండ 2 రిలీజ్ డైల‌మాలో ప‌డింది. ఈ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Dec 11, 2025, 3.17 pm IST

Akhanda 2 | అఖండ 2 మేక‌ర్స్  భారీ షాక్ –  బెనిఫిట్ షోలు క్యాన్సిల్

అఖండ 2

Advertisement

Akhanda 2 |అఖండ 2 రిలీజ్‌కు ముందు నిర్మాత‌ల‌కు పెద్ద షాక్ త‌గిలింది. బెనిఫిట్ షోల‌తో టికెట్ ధ‌ర‌ల పెంపును హైకోర్టు క్యాన్సిల్ చేసింది. డిసెంబ‌ర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ చివ‌రి నిమిషంలో ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసింది. త‌మ‌కు రావాల్సిన పాత బ‌కాయిల‌ను క్లియ‌ర్ చేసే వ‌ర‌కు అఖండ 2 విడుద‌ల చేయ‌డానికి వీలులేదంటూ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్టుకు వెళ్ల‌డంతో అఖండ 2 పోస్ట్‌పోన్ అయ్యింది. టాలీవుడ్ పెద్దల స‌హ‌కారంతో ఆర్థిక స‌మ‌స్య‌ల‌ నుంచి గ‌ట్టెక్కిన నిర్మాత‌లు డిసెంబ‌ర్ 12న అఖండ 2 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. టికెట్ రేట్ల‌తో పాటు బెనిఫిట్ షోల‌కు సంబంధించిన అనుమ‌తులు మ‌ళ్లీ తీసుకున్నారు.
గురువారం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియ‌ర్ షోస్‌తో అఖండ 2 రిలీజ్ కాబోతుంది. ఈ సారి ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా రిలీజ్ అవుతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలోనే మేక‌ర్స్‌కు  మరో ఎదురుదెబ్బ త‌గిలింది.
అఖండ బెనిషిట్ షోల‌కు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వంద‌ల వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించారు. రిలీజ్ డేట్ నుంచి ప‌ది రోజుల వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో యాభై, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో వంద వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తూ తెలుగు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు జీవోలు జారీ చేశాయి.
ఈ టికెట్ రేట్ల జీవోను ర‌ద్దు చేయ‌డంతో పాటు బెనిఫిట్ షోల‌ను క్యాన్సిల్ చేయాలంటూ స‌తీష్ క‌మ‌ల్ అనే వ్య‌క్తి హైకోర్టును ఆశ్ర‌యించాడు.ఈ పిటిష‌న్‌ను విచారించిన కోర్టు టికెట్ ధ‌ర‌ల పెంపు జీవోను ర‌ద్దు చేసింది. బెనిఫిట్ షోల‌ను క్యాన్సిల్ చేసింది. హైకోర్టు నిర్ణ‌యం నిర్మాత‌ల‌కు పాటు టాలీవుడ్ వ‌ర్గాలను విస్మ‌య‌ప‌రుస్తోంది. బెనిఫిట్ షోల‌తో పాటు టికెట్ రేట్ల ర‌ద్దుతో నిర్మాత‌ల‌కు భారీగానే న‌ష్టం వాటిల్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రోసారి ఈ సినిమా వాయిదాప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
అఖండ 2 మూవీకి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కుతున్న నాలుగో మూవీ ఇది. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement