త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhanda 2 | అవ‌న్నీ రూమ‌ర్స్ – అఖండ 2 ప్రీమియ‌ర్స్ ర‌ద్దుపై మేక‌ర్స్ క్లారిటీ

Akhanda 2 | అఖండ 2 ప్రీమియ‌ర్స్ ర‌ద్దు అంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై మేక‌ర్స్ రియాక్ట్ అయ్యారు. అవ‌న్నీ రూమ‌ర్స్ అంటూ తేల్చిచెప్పారు. గురువారం ఎలాంటి అడ్డంకులు లేకుండా అఖండ 2 ప్రీమియ‌ర్స్ ఉంటాయ‌ని పేర్కొన్నారు.

N

Entertainment | Published On Dec 11, 2025, 7.29 pm IST

Akhanda 2 | అవ‌న్నీ రూమ‌ర్స్ – అఖండ 2 ప్రీమియ‌ర్స్ ర‌ద్దుపై మేక‌ర్స్ క్లారిటీ

అఖండ 2

Advertisement

Akhanda 2 | బాల‌కృష్ణ (Balakrishna) అఖండ 2 (Akhanda 2) ప్రీమియ‌ర్స్ ర‌ద్దుతో పాటు టికెట్ పెంపు ధ‌ర‌ల జీవోను తెలంగాణ హైకోర్టు స‌స్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పుతో డిసెంబ‌ర్ 11న తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 ప్రీమియ‌ర్స్ క్యాన్సిల్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ 12న రెగ్యుల‌ర్ ధ‌ర‌లు, షోస్‌తోనే అఖండ 2 రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా ప‌డింది. అప్పుడు కూడా ఇలాగే బెనిఫిట్ షోల‌కు కొద్ది గంట‌ల ముందు చెన్నై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ సారి తెలంగాణ హైకోర్టు కూడా మేక‌ర్స్‌కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో బెనిఫిట్ షోలు ఉంటాయా? మ‌ళ్లీ ఈ సినిమా వాయిదాప‌డుతుందా? అనే టెన్ష‌న్ నంద‌మూరి అభిమానుల్లో మొద‌లైంది.
ఈ పుకార్ల‌పై అఖండ 2 మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రీమియ‌ర్ షోలో ర‌ద్దు అంటూ వ‌స్తోన్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దంటూ పేర్కొన్నారు. అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మేన‌ని తేల్చిచెప్పారు. గురువారం రాత్రి నుంచే అఖండ 2 ప్రీమియ‌ర్స్ ఉంటాయ‌ని, అన్ని స‌రైన ట్రాక్‌లోనే స‌వ్యంగా జ‌రుగుతున్నాయంటూ పేర్కొన్నారు. మేక‌ర్స్ క్లారిటీతో బాల‌కృష్ణ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
బెనిఫిట్ షోల‌కు సంబంధించిన టికెట్లు అన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో క‌నిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు అంద‌లేద‌ని అంటున్నారు. దాదాపు ప్రీమియ‌ర్ షోస్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చున‌ని చెబుతున్నారు.
ప్రీమియ‌ర్ షోస్ టికెట్ ధ‌ర‌ల‌ను ఆరు వంద‌లుగా నిర్ణ‌యిస్తూ ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి. రిలీజ్ డేట్ నుంచి ప‌ది రోజ‌లు వ‌ర‌కు టికెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించారు.
అఖండ 2 మూవీకి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అఖండ‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. గ‌తంలో బాల‌కృష్ణ, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు వ‌చ్చాయి. అఖండ 2తో డ‌బుల్ హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. అఖండ 2లో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆది పినిశెట్టి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement