త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ – అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ – క‌న్న‌డ బ్యూటీకి ఛాన్స్‌

అజిత్ డేర్‌డెవిల్ సినిమాను హీరోయిన్ క‌ష్టాలు వెంటాడుతున్నాయి. తొలుత ఈ సినిమాలో శ్రీలీల‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. కానీ అజిత్‌, శ్రీలీల ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ రావ‌డంతో ధ‌మాకా బ్యూటీ ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా క‌న్న‌డ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ పేరు వినిపిస్తోంది

N

Entertainment | Published On Sep 28, 2026, 4.07 pm IST

Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ – అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ – క‌న్న‌డ బ్యూటీకి ఛాన్స్‌
Advertisement

Ashika Ranganath | కోలీవుడ్ హీరో అజిత్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి రెండేళ్లు దాటిపోయింది. 2025లో వ‌చ్చిన గుడ్‌బ్యాడ్ అగ్లీ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన అజిత్ మోట‌ర్ రేసింగ్ పోటీల‌పై దృష్టిసారించారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లే డేర్ డెవిల్ పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు అజిత్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

షాలిని ప్రొడ్యూస‌ర్‌...

అజిత్ రెమ్యూన‌రేష‌న్‌, బ‌డ్జెట్ ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాను నిర్మించ‌డానికి నిర్మాత‌లు ఎవ‌రూ ముందుకు రాలేదు. దాంతో బ్రేవ్‌హార్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను స్థాపించిన అజిత్ త‌న భార్య షాలిని ప్రొడ్యూస‌ర్‌గా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ నుంచి డేర్ డెవిల్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

హీరోయిన్ క‌ష్టాలు...

డేర్ డెవిల్ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ అడ్డంకులు తొల‌గిన త‌ర్వాత హీరోయిన్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తొలుత క‌థానాయిక‌గా శ్రీలీల‌ను మేక‌ర్స్ ఫైన‌ల్ చేశారు. కానీ అజిత్‌, శ్రీలీల మ‌ధ్య ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ వ‌చ్చాయి. అజిత్ ప‌క్క‌న శ్రీలీల కూతురిలా క‌నిపిస్తుంద‌ని, రాంగ్ ఛాయిస్ అంటూ కామెంట్లు పెట్టారు. ఈ విమ‌ర్శ‌ల కార‌ణంగా షూటింగ్ మొద‌లుకాక‌ముందే శ్రీలీల ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది. ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. చివ‌ర‌కు క‌న్న‌డ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా తీసుకున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆషికా రంగ‌నాథ్‌తో పాటు మ‌రో నాయిక‌గా ఆండ్రియాను ఖ‌రారు చేసిన‌ట్లు చెబుతున్నారు.

స‌ర్ధార్ 2

ఇటీవ‌లే త‌మిళంలో స‌ర్ధార్ 2 సినిమా చేసింది ఆషికా రంగ‌నాథ్‌. కార్తి హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో 20 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

.

Advertisement
Advertisement