Mufti Police Review | మఫ్టీ పోలీస్ రివ్యూ – ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ఐశ్వర్య రాజేష్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మఫ్టీ పోలీస్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి దినేష్ దర్శకత్వం వహించాడు
Entertainment | Published On Jan 4, 2026, 10.45 am IST
Mufti Police Review | ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మఫ్టీ పోలీస్ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ హీరో అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు దినేష్ దర్శకత్వం వహించారు. మఫ్టీ పోలీస్ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో ఓటీటీ ఆడియెన్స్‌ను ఐశ్వర్య రాజేష్ మెప్పించిందా? లేదా? అంటే?
కిల్లర్ ఎవరు?
ఫేమస్ రైటర్ అయిన జెబనేసన్ అలియా జెబా దారుణ హత్యకు గురవుతాడు. కారులో వెళుతున్న అతడిని గుర్తు తెలియని వ్యక్తి అడ్డగించి చంపేస్తాడు. ఈ మర్డర్ కేసును పోలీస్ ఆఫీసర్ మగుడపతి (అర్జున్) ఇన్వేస్టిగేట్ చేస్తుంటాడు. చనిపోవడానికి ముందు కావేరి తీరం పేరుతో ఓ బుక్ రాస్తాడు జెబా. ఆ బుక్ పబ్లిష్ చేయకుండానే మరణిస్తాడు. ఆది ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తల్లి మానసిక సమస్యతో బాధపడుతుంటుంది. ఆమె బాగోగులను ఆది చూసుకుంటుంటాడు. ఆది మంచితనం చూసి మీరా (ఐశ్వర్య రాజేష్) అతడిని ప్రేమిస్తుంది. మరోవైపు జెబా హత్య కేసుతో సంబంధం ఉందని మగుడపతి అనుమానించిన వారంతా ఒక్కొక్కరుగా అతడి కళ్ల ముందే మర్డర్ అవుతుంటారు. మీరానే ఈ హత్యలు చేస్తుంటుంది. ఆటిజంతో బాధపడే పిల్లలకు టీచర్‌గా పనిచేసే మీరా ఈ హత్యలు ఎందుకు చేస్తుంది? చివరకు తాను ప్రేమించిన ఆదినే ఆమె ఎందుకు చంపాల్సివచ్చింది? కావేరి ఎవరు? మీరా హంతకురాలు అనే విషయం మగుడపతి ఎలా కనిపెట్టాడు? అన్నదే ఈ మూవీ కథ.
కొత్తదనం మిస్....
కమర్షియల్ పంథాకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటుంది ఐశ్వర్య రాజేష్. ఆమె నుంచి ఓ సినిమా వస్తుందంటే కథ, పాత్రల పరంగా అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే నమ్మకం ఆడియెన్స్‌లో కనిపిస్తుంటుంది. కానీ మఫ్టీ పోలీస్ మాత్రం అందుకు మినహాయింపుగా నిలిచింది. రాత, తీతలోనే ఎక్కడ మచ్చుకైనా ఫ్రెష్‌నెస్ కనిపించదు. 1990 కాలం నాటి సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
క్రైమ్ థ్రిల్లర్ కానీ...
చైల్డ్ అబ్యూజింగ్ అనే పాయింట్‌కు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు దినేష్ ఈ కథను రాసుకున్నారు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. పాత కథనే డైరెక్టర్ కొత్తగా చెప్పాడా అంటే అదీ లేదు. రైటర్ హత్యతోనే ఈ సినిమా మొదలవుతుంది. ఓ పక్క అర్జున్ ఇన్వేస్టిగేషన్...మరోవైపు ఆది, మీరా ప్రేమకథతో సినిమా నీరసంగా సాగుతుంది. కథ ఎంతకు ముందు కదలక అక్కడే తిరుగుతూ సీరియల్‌ను తలపిస్తుంది. మీరానే ఈ హత్యలు చేస్తుందనే ట్విస్ట్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో హీరో లేదంటే హీరోయిన్‌కు ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉండటం కామన్. ఇందులోనూ ఆటిజంతో బాధపడే చిన్నారి, ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించారు. క్లైమాక్స్‌లో విలన్ ఎవరన్నది క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ ఈజీగానే గెస్ చేస్తారు. ఆ ట్విస్ట్ కొంత మేర పర్వాలేదనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాల్లో మెరుపులు, మ్యాజిక్ మచ్చుకైనా సినిమాలు కనిపించవు.
ఐశ్వర్య రాజేష్ కష్టం వృథా...
అర్జున్, ఐశ్వర్య రాజేష్, అభిరామి లాంటి టాలెంటెడ్ యాక్టర్లు...ఈ రొటీన్ స్టోరీని నిలబెట్టేందుకు చాలానే కష్టపడ్డారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలు అర్జున్‌కు కొట్టిన పిండే. ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. ఈ సినిమా కోసం చాలానే కష్టపడింది. రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేసింది. డైరెక్టర్ పేలవమైన టేకింగ్ కారణంగా ఆమె శ్రమ మొత్తం వృథాగా మారిపోయింది. ఆది పాత్ర చేసిన యాక్టర్ నటన ఓకే. టెక్నికల్‌గా ఈ సినిమా యావరేజ్‌గానే ఉంది.
మఫ్టీ పోలీస్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.
సంబంధిత వార్తలు

Vidya Balan | ఐశ్వర్య రాజేశ్ పాత్రలో విద్యాబలన్..! ఇది మన తెలుగు సినిమానే..!
మే 13, 2026

Sathi Leelavathi Review | సతీ లీలావతి రివ్యూ – మెగా కోడలి రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
మే 8, 2026

Dhanush Kara Review | కర రివ్యూ – ధనుష్, మమితా బైజు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



