Rashmi Gautam | యాంకర్ నుంచి జడ్జిగా ప్రమోషన్ – ఓటీటీలో రష్మి గౌతమ్ కొత్త రియాలిటీ షో – కంటెస్టెంట్స్ వీళ్లే
తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. టాప్ తెలుగు ఇన్‌ప్లూయెన్సర్ పేరుతో టెలికాస్ట్ కానున్న ఈ షోకు మంచు లక్ష్మి, రష్మి గౌతమ్, వైవా హర్ష జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. జూలై 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ షో టెలికాస్ట్ కాబోతుంది.
Entertainment | Published On Jun 26, 2026, 8.13 pm IST
Rashmi Gautam | జబర్ధస్థ్ యాంకర్ రష్మి గౌతమ్ జడ్జిగా మారింది. ఓ రియాలిటీ షోకు జ్యూరీగా వ్యవహరించబోతుంది. టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ పేరుతో తెలుగులో మరో కొత్త రియాలిటీ షో మొదలుకాబోతుంది. జూలై 3 నుంచి ఆహా ఓటీటీలో టెలికాస్ట్ కానున్న ఈ షోకు మంచు లక్ష్మి, వైవా హర్షతో పాటు రష్మి గౌతమ్ జడ్జ్‌లుగా కనిపించనున్నారు.
కంటెస్టెంట్స్ వీళ్లే...
ఎనిమిది ఎపిసోడ్స్‌తో కూడిన టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ షోలో పలువురు సోషల్ మీడియా సెలిబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొనబోతున్నారు. విశ్వభారత్, ఫేమస్ రామ్, సింధు కసారం, అనిరుధ్ నారాయణం, రవి కిరణ్ బేవర, అఖిల్ జాక్సన్, డయానా, రవి, గౌతమ్ కుమార్, అమృత భూపతిరాజు, గ్రాండ్‌పా కిచెన్ టాప్ టైటిల్ కోసం పోటీపడబోతున్నారు.
ప్రత్యేక థీమ్...
తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ షోలోని ప్రతి ఎపిసోడ్ ప్రత్యేక థీమ్‌తో సాగుతుందట. కంటెస్టెంట్స్‌కు డిఫరెంట్ టాస్క్‌లతో పోటీపడాల్సివుంటుంది. సోషల్ మీడియా ఛాలెంజ్‌లు, రీల్స్ టాస్క్‌లు కొత్తగా ఉంటాయని అంటున్నారు. ఓటింగ్‌లో ఆడియెన్స్ ప్రత్యక్షంగా పాల్గొనేలా ఈ టాస్క్‌లను డిజైన్ చేసినట్లు మేకర్స్ చెబుతోన్నారు. ఎలిమినేషన్లు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. షతెలుగు డిజిటల్ క్రియేటర్స్ లోని ప్రతిభను వెలికితీసే కార్యక్రమం ఇది. ఈతరం ఆడియెన్స్ కంటెంట్ ను ఎలా చూస్తున్నారో, ఎలా షేర్ చేసుకుంటున్నారో తెలియజేసే షో ఇదిష అని ఆహా ఓటీటీ ప్రతినిధులు వెల్లడించారు.
సినిమాలతో...
ప్రస్తుతం జబర్ధస్థ్ కామెడీ షోకు రష్మి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కామెడీ షోతోనే బుల్లితెరపై ఫేమస్ అయ్యింది. యాంకర్‌గానే కాకుండా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. బొమ్మ బ్లాక్‌బస్టర్, గుంటూరు టాకీస్, అంతం, అంతకుమించితో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మరోవైపు మంచు లక్ష్మి ఇటీవలే లేచింది మహిళా లోకం పేరుతో ఓ క్రైమ్ కామెడీ మూవీ చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu Web Series | అప్పట్లో సూపర్ హిట్ సీరియల్ …ఇప్పుడు వెబ్‌సిరీస్‌గా అరవై ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్
జూన్ 22, 2026

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు – ఒక్కోటి ఒక్కో జానర్
జూన్ 18, 2026

OTT | నేరుగా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – ఈ వీక్‌లోనే స్ట్రీమింగ్
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు - ఫొటోలు వైరల్
- ●TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
- ●ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ
- ●Srinivas Goud | ఆర్ఎస్పీని చంపడానికే సెక్యూరిటీ తీసేశారు
- ●Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం - సమంత సినిమాకు లాభాలు - రష్మిక సినిమాకు నష్టాలు

Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు - ఫొటోలు వైరల్

TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ

ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ



