Tripti Dimri | ప్రభాస్ తర్వాత నానితో – టాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రి
ప్రభాస్ స్పిరిట్ తర్వాత టాలీవుడ్‌లో త్రిప్తి డిమ్రి మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. నాని హీరోగా ఓజీ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Feb 21, 2026, 2.42 pm IST
Tripti Dimri | సందీప్ వంగా (Sandeep Vanga)డైరెక్షన్‌లో రూపొందిన యానిమల్ (Animal Movie) మూవీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి చేసింది చిన్న పాత్రే కానీ హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న (Rashmika Mandanna ) కంటే ఈ బాలీవుడ్ బ్యూటీకే ఎక్కువగా పేరొచ్చింది. రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రి కాంబినేషన్‌లోని బోల్డ్ సీన్లు అప్పట్లో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. యానిమల్ బ్లాక్‌బస్టర్‌తో త్రిప్తి డిమ్రికి బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే తెలుగులో మరో బంపరాఫర్ అందుకుంది.
స్టైలిష్ యాక్షన్ మూవీ...
ఓజీ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నానితో ఓ సినిమా చేయబోతున్నాడు డైరెక్టర్ సుజీత్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఇటీవలే అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. జూన్ లేదా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి ఎంపికైనట్లు సమాచారం. హీరోయిన్ రోల్ కోసం పూజాహెగ్డే, రుక్మిణి వసంత్ లాంటి దక్షిణాది హీరోయిన్లతో పాటు పలువురు బాలీవుడ్ అందాల తారల పేర్లను పరిశీలించిన మేకర్స్ చివరకు త్రిప్తి డిమ్రిని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
యానిమల్ తరహాలోనే నాని మూవీలో బోల్డ్ రోల్‌లో త్రిప్తి డిమ్రి కనిపించబోతున్నట్లు తెలిసింది. నాని సినిమాలో త్రిప్తి డిమ్రితో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు సమాచారం.
ధురంధర్ ఫేమ్...
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోన ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ధురంధర్ ఫేమ్ శశ్వాత్ సచ్‌దేవ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు.
ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్‌తో నాని బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి 26న ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. షూటింగ్ డిలే వల్ల ఆగస్ట్ 21కి వాయిదావేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



