Balakrishna vs Karthi | అప్పుడు అబ్బాయ్‌తో…ఇప్పుడు బాబాయ్‌తో – నందమూరి హీరోలతో కార్తి బాక్సాఫీస్ క్లాష్
Balakrishna vs Karthi | గత ఏడాది ఎన్టీఆర్ దేవరకు పోటీగా హీరో కార్తి సత్యం సుందరం రిలీజైంది. ఈ ఏడాది మరోసారి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ రోజే కార్తి అన్నగారు వస్తారు విడుదల కాబోతుంది. వరుసగా నందమూరి హీరోలకు పోటీగా కార్తి సినిమాలు రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Dec 10, 2025, 6.00 pm IST
బాలకృష్ణ వర్సెస్ కార్తి
Balakrishna vs Karthi | కోలీవుడ్ హీరో కార్తికి తెలుగులోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కార్తి హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ సినిమాలు అవారా, యుగానికి ఒక్కడు, సత్యం సుందరంతో పాటు పలు సినిమాలు తెలుగులోనూ పెద్ద హిట్టయ్యాయి. స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌లో కార్తికి చాలానే అవకాశాలు వరించాయి. నాగార్జునతో ఊపిరి సినిమా చేశారు. శైలేష్ కొలనుతో హిట్ 4 చేయబోతున్నాడు.
కాగా కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వా వాథియార్ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమాను తెలుగులోనూ అన్నగారు వస్తారు పేరుతో డబ్ చేస్తున్నారు. డిసెంబర్ 12 బాక్సాఫీస్ బరిలోకి అనుకోకుండా అఖండ 2 చేరింది. బాలకృష్ణ సినిమా కోసం మోగ్లీ, ఈషాతో సైక్ సిద్ధార్థ మేకర్స్ త్యాగం చేశారు. తమ సినిమాలను వాయిదా వేశారు. ప్రస్తుతం డిసెంబర్ 12న అఖండ 2తో పాటు కార్తి అన్నగారు వస్తారు మాత్రమే రిలీజ్ కాబోతున్నాయి. బాలకృష్ణ మాస్ సినిమాకు కార్తి మూవీ ఎంత వరకు పోటీ ఇస్తుందన్నది తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.
గత ఏడాది సత్యం సుందరరం సినిమాతో కార్తి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కల్ట్ క్లాసిక్‌గా ఈ మూవీ నిలిచింది. 2024 సెప్టెంబర్ 27న సత్యం సుందరం రిలీజైంది. అదే రోజు ఎన్టీఆర్ దేవర మూవీ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవర మేనియా కారణంగా సత్యం సుందరం బాక్సాఫీస్ వద్ద నిలబడటమే కష్టమని అంతా అనుకున్నారు. కానీ మౌత్ టాక్‌తో హిట్టు కొట్టాడు కార్తి.
దేవర సినిమాతో ఎన్టీఆర్‌తో పోటీ పడ్డ కార్తి ...ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2తో క్లాష్‌కు రెడీ అయ్యాడు. ఇద్దరు నందమూరి హీరోలే కావడం ఆసక్తికరంగా మారింది. అబ్బాయ్‌తో పోటీలో విన్నర్‌గా నిలిచిన కార్తి...ఇప్పుడు బాబాయ్‌తో క్లాష్‌లో సేమ్ రిజల్ట్‌ను రిపీట్ చేస్తాడా? లేదా? అన్నది చూడాల్సిందే.
నందమూరి హీరోలతో బాక్సాఫీస్ పోటీపై కార్తి కూడా రియాక్ట్ అయ్యాడు. రిలీజ్ డేట్ హీరోల చేతులో ఉండదని అన్నాడు. అఖండ 2 సినిమా చూసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
అన్నగారు వస్తారు మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నలన్ కుమారస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






