Nayanthara | అప్పుడు షారుఖ్ – ఇప్పుడు సల్మాన్‌తో రొమాన్స్ – బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన నయన్
షారుఖ్‌ఖాన్ జవాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. తొలి అడుగులోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. తాజాగా నయన్ మరో హిందీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సల్మాన్‌ఖాన్‌తో జోడీకట్టబోతున్నట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Mar 8, 2026, 11.50 am IST
Nayanthara | ఇదివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ రూల్ చేసింది. హిందీ సినిమా చేయడం గౌరవంగా దక్షిణాది యాక్టర్లు భావించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్‌ను సౌత్ ఇండస్ట్రీ పూర్తిగా డామినేట్ చేస్తోంది. దక్షిణాది సినిమాలు వేల కోట్ల వసూళ్లతో సత్తా చాటుతోండగా...బాలీవుడ్ సినిమాలు మాత్రం వందల కోట్లకే కిందమీదా పడుతోన్నాయి. దక్షిణాది హీరోలతో పాటు హీరోయిన్లు, డైరెక్టర్లకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు దర్శకులు, హీరోయిన్లతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తిని చూపుతున్నారు.
తెలుగు డైరెక్టర్....
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బాలీవుడ్ మూవీని దిల్‌రాజు నిర్మించబోతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టాక్. సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా వంశీ పైడిపల్లి మంచి కమర్షియల్ కథను రెడీ చేశాడట.
జవాన్ తర్వాత....
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. షారుఖ్‌ఖాన్ జవాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అట్లీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ 1100 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. జవాన్ సక్సెస్‌తో నయనతారకు బాలీవుడ్ నుంచి చాలానే ఆఫర్లు వచ్చాయి. కానీ వాటన్నింటిని కాదని సల్మాన్‌ఖాన్ సినిమాకు ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే సల్మాన్‌ఖాన్, నయనతార మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం.
లాంగ్ గ్యాప్ తర్వాత...
కాగా ఇటీవలే చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారుతో లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది నయనతార. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యశ్ హీరోగా నటించిన కన్నడ మూవీ టాక్సిక్‌లో నయనతార ఓ హీరోయిన్‌గా నటించింది. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



