Allu Arjun | తెలుగు దర్శకులను పట్టించుకోని అల్లు అర్జున్ – మలయాళ డైరెక్టర్‌కు ఛాన్స్
అట్లీ, లోకేష్ కనగరాజ్ తర్వాత మరో పరభాష డైరెక్టర్‌కు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Mar 30, 2026, 5.39 pm IST
Allu Arjun | తెలుగు డైరెక్టర్లను దూరం పెడుతోన్న అల్లు అర్జున్ వరుసగా పరభాష దర్శకులకే అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తోన్న సినిమాతో బన్నీ బిజీగా ఉన్నాడు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది అల్లు అర్జున్, అట్లీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్...
అట్లీ మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో ఓ మూవీ లైన్‌లో పెట్టాడు బన్నీ. ఇటీవలే ఈ పాన్ ఇండియన్ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఓ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి మొదలుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అట్లీ, లోకేష్ కనగరాజ్ సినిమాలు సెట్స్‌పై ఉండగానే బన్నీ మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీ, బాసిల్ జోసెఫ్ మూవీపై ఏప్రిల్ 8న అఫీషియల్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందట.
కేరళలో...
కేరళలో బన్నీకి భారీగా ఫాలోయింగ్ ఉంది. పుష్ప 2తో అల్లు అర్జున్ నటించిన పలు సినిమాలు మలయాళంలో భారీగా వసూళ్లను రాబట్టాయి. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొనే బాసిల్ జోసెఫ్‌కు బన్నీ ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. బన్నీ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇటీవల అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో అట్లీ, లోకేష్ కనగరాజ్‌తో పాటు బాసిల్ జోసెఫ్ కూడా పాల్గొన్నాడు.ఈ పెళ్లి వేడుక ద్వారానే తమ కాంబోపై అఫీషియల్‌గా బన్నీ హింట్ ఇచ్చేశాడని అభిమానులు చెబుతోన్నారు.
కాగా వరుసగా పరాభాష దర్శకులకు ఛాన్స్ ఇస్తూ తెలుగు డైరెక్టర్లను దూరం పెట్టడంపై బన్నీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తెలుగు దర్శకుల వల్లే బన్నీకి పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చిందని, అది మర్చిపోయి ఇతర భాష డైరెక్టర్లను ఎంకరేజ్ చేయడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



