Horror OTT | మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ మూవీ – లంకెబిందెలకు కాపలాగా ధనపిశాచి
సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ మూవీ శనివారం జీ5 ఓటీటీలో రిలీజైంది. జటాధర సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
Entertainment | Published On Mar 28, 2026, 2.51 pm IST
Horror OTT | సుధీర్‌బాబు హీరోగా నటించిన తెలుగు మూవీ జటాధర మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తాజాగా శనివారం జీ5 ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో గత ఏడాది డిసెంబర్‌లోనే జటాధర అందుబాటులోకి వచ్చింది. జీ5 ఓటీటీలోకి మాత్రం థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత విడుదల కావడం గమనార్హం.
సోనాక్షి సిన్హా...
జటాధర మూవీతో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సీనియర్ కథానాయిక శిల్పాశిరోధ్కర్ కీలక పాత్రలో కనిపించింది. దివ్యా ఖోస్లాకుమార్ హీరోయిన్‌గా నటించింది. అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజీవ్ రాజ్ మ్యూజిక్ అందించాడు.
20 కోట్ల బడ్జెట్...
భారీ బడ్జెట్‌తో పాటు అంచనాల నడుమ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన జటాధర డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో ఏడున్నర కోట్ల లోపే కలెక్షన్స్ దక్కించుకుంది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ఏకకాలంలో రూపొందించారు. రెండు భాషల ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. ధనపిశాచి కాన్సెప్ట్‌ను దర్శకద్వయం థ్రిల్లింగ్‌గా చెప్పలేకపోయారు. హారర్ ఎలిమెంట్స్ కూడా అంతగా వర్కవుట్ కాలేదు.
శివ అన్వేషణ...
శివ (సుధీర్ బాబు) ఓ ఘోస్ట్ హంటర్. దయ్యాలు ఉన్నాయని జనాలు అనుకుంటున్న ప్రతి చోటుకు వెళ్లి రీసెర్స్ చేస్తుంటాడు. దయ్యాలు లేవని నిరూపిస్తుంటాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పిన వినడు. శివకు రుద్రారం అనే విలేజ్ గురించి తెలుస్తుంది. ఆ ఊరిలోని పెద్ద బంగళాలో ఉన్న లంకెబిందెలకు కాపలాగా ధనపిశాచి ( సోనాక్షి సిన్హా) ఉంటుంది. ఆ లంకెబిందెలను కాజేయాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని దారుణంగా హతమారుస్తుంది. ధనపిశాచిది కట్టుకథగా భావించిన శివ రుద్రారం వస్తాడు? అక్కడ అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? తన సొంత తల్లిదండ్రులు కూడా ధనపిశాచి వల్లే చనిపోయారనే నిజం తెలిసి శివ ఏం చేశాడు? లంకె బిందెల కోసం శివ మేనత్త శోభ (శిల్పాశిరోధ్కర్) వేసిన ప్లాన్ ఏమిటి? అనే అంశాలతో జటాధర మూవీ రూపొందింది.
సంబంధిత వార్తలు

Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మే 14, 2026

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



