Adivi Sesh | బ్రేకప్ బాధ నుంచి బయటపడటానికి పదేళ్లు పట్టింది – హీరో అడివిశేష్ కామెంట్స్
మేజర్ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్‌లో చాలా ఆఫర్లు వచ్చాయని అడివి శేష్ అన్నారు. కానీ కథలు నచ్చక ఆ ఆఫర్లు రిజెక్ట్ చేసినట్లు పేర్కొన్నాడు. డెకాయిట్ కోసం డ్యాన్స్‌లు, యాక్షన్ పరంగా నాకున్న లిమిటేషన్స్ మొత్తం దాటేశానని అన్నారు అడివిశేష్.
Entertainment | Published On Apr 6, 2026, 8.08 pm IST
Adivi Sesh | టాలీవుడ్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు అడివిశేష్. అతడి నుంచి సినిమా వస్తుందంటే తప్పకుండా ఏదో కొత్తదనం ఉంటుందనే నమ్మకం ఆడియెన్స్‌లో కనిపిస్తుంది. అడివిశేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డెకాయిట్ రిలీజ్ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ గురించి అడివిశేష్ ఏమన్నారంటే?
లవ్ స్టోరీ ప్రధానంగా...
డెకాయిట్ మూవీ ట్రైలర్‌కు తెలుగుతో పాటు హిందీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. హిందీలో మేము ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ రీచ్ ఉంది. ఫస్ట్ టైం భోజ్ పురి లో కూడా ప్రీమియర్ చేస్తారా అని అడిగారు. అది విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. డెకాయిట్ కథ లవ్ స్టోరీ ప్రధానంగా సాగుతుంది ఇందులో ప్రతి ఎమోషన్ ఆర్గానిక్ గా ఉంటుంది. ఒకరోజు డెకాయిట్ పాయింట్ మైండ్ లోకి వచ్చింది. 'ఒక బిజీ రోడ్డుపైన కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే'...ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి ఈ కథ మొదలైంది. ఒక ఇంటెన్స్ యాక్షన్ మధ్యలో లవ్ స్టోరీతో చాలా డిఫరెంట్‌గా సినిమా ఉంటుంది.
ఆ లిమిట్ దాటాను...
చిన్నప్పుడు ఫంక్షన్స్‌లో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు డాన్స్ చేయొద్దు ఎవరో అన్నారు అప్పటినుంచి ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. సినిమాల్లో కూడా డ్యాన్స్ చేయద్దని నాకు నేనే ఆ లిమిట్ పెట్టుకున్నాను. కానీ ఈ సినిమా కోసం ఆ లిమిటేషన్ దాటాను. ఇందులో చేసిన హరి క్యారెక్టర్ నా వ్యక్తిగత జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మనసులో ఏదున్నా మొహం మీద ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసమే మదనపల్లి యాస ప్రాక్టీస్ చేసి చేసి ఇంట్లో కూడా మాట్లాడటం మొదలు పెట్టాను. నా యాస చూసి మా అమ్మ 'ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటూ షాకయ్యింది.
మహేష్ డైలాగ్...
సినిమాలో మహేష్‌బాబు డైలాగ్ ఉంటే బాగుంటుందని రైటింగ్ ప్రాసెస్ లో ఐడియా వచ్చింది. సిట్యూవేషన్‌కు కూడా ఆ డైలాగ్ బాగా యాప్ట్ అయ్యింది డెకాయిట్ మూవీ కోసం రిస్కీ స్టంట్స్ చేశా. మోకాలికి గాయం కూడా అయింది. ఆ ప్రమాదం వల్ల రెండు మూడు నెలలు సినిమా డిలే అయింది. ఆ ఎఫెక్ట్ గూడచారి 2 పై కూడా పడింది. ఒక 6 నెలలు యాక్షన్ చేయొద్దని డాక్టర్లు సూచించారు. ఈ సినిమాలో ఫైట్స్ తక్కువ స్టంట్స్ ఎక్కువ. . 45 డిగ్రీల వేడిలో చేసిన క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుంది.
బాలీవుడ్‌లో అవకాశాలు...
మేజర్ తర్వాత ఓ నాలుగు వార్ బ్యాక్‌డ్రాప్ సినిమాలతో పాటు రెండు బయోపిక్‌లలో అవకాశాలు వచ్చాయి. మేజర్ తర్వాత వెంటనే వార్ సినిమా చేయడం కెరీర్ పరంగా కరెక్ట్ కాదనించింది. . బిగ్ బ్యానర్స్ నుంచి బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే ఆ కథలు నాకు నచ్చలేదు.
బ్రోకెన్ లవ్ స్టోరీస్....
నాకు బ్రోకెన్ లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. నేను చేసే ప్రతి సినిమాలో నా లైఫ్ లో జరిగింది ఎంతో కొంత చూపించడానికి ప్రయత్నిస్తా. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఏం అర్థం కాలేదు. అప్పుడు నాకు 19 ఏళ్ళు. ఆ విఫల ప్రేమ తాలూకు బాధ నుంచి బయటపడడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఆ బ్రేకప్ స్టోరీ పెయిన్ కొంత డెకాయిట్‌లో హరి క్యారెక్టర్‌లో కనిపిస్తుంది.
ఫిట్‌నెస్ సీక్రెట్....
నేను మద్యం, సిగరెట్లకు దూరంగా ఉంటాను. అలాగే నాన్ వెజ్ కూడా తినను. అమెరికాలో పెరగడం వల్ల మసాలాలు కారం కూడా ఎక్కువగా తినలేను. అదే నా ఫిట్‌నెస్ సీక్రెట్.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



