Adivi Sesh | అడివిశేష్ డెకాయిట్ పోస్ట్‌పోన్? – రిలీజ్ డేట్ లేకుండా పోస్టర్ రిలీజ్
అడివిశేష్ డెకాయిట్ నుంచి సోమవారం సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ రివీలైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Feb 23, 2026, 9.22 pm IST
Adivi Sesh | అడవిశేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ డెకాయిట్. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్‌ను మేకర్స్ సోమవారం రివీల్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రుబరూ అంటూ రొమాంటిక్ మెలోడీగా ఫస్ట్ సింగిల్ ఉండబోతున్నట్లు వెల్లడించారు.
కెమిస్ట్రీ హైలైట్....
సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జోవియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. రూబరూ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు . రుబరూ పాటకు భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ అందించినట్లు మేకర్స్ తెలిపారు.
షానియల్ డియో...
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ బైలింగ్వల్ మూవీతో షానియల్ డియో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తోన్నాడు.
రిలీజ్ డేట్ లేకుండా...
రుబరూ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడం ఆసక్తికరంగా మారింది. మార్చి 19న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అదే రోజు రణవీర్‌సింగ్ ధురంధర్ 2తో పాటు యశ్ టాక్సిక్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలతో పోటీ కారణంగా ఇప్పటికే రామ్‌చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ పోస్ట్‌పోన్ అయ్యాయి. తాజాగా డెకాయిట్ కూడా వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



