త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | కాంట్ర‌వ‌ర్సీ ఏం లేదు – డెకాయిట్ నుంచి శృతి హాస‌న్ త‌ప్పుకోవ‌డంపై అడివి శేష్ కామెంట్స్‌

అడివి శేష్ డెకాయిట్‌లో మొద‌ట శృతి హాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్నాళ్లు షూటింగ్ చేసిన శృతి హాస‌న్ స‌డెన్‌గా సినిమా నుంచి త‌ప్పుకుంది. డెకాయిట్ నుంచి శృతి హాస‌న్ త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అడివి శేష్ రివీల్ చేశాడు.

a

Entertainment | Published On Dec 22, 2025, 4.44 pm IST

Shruti Haasan | కాంట్ర‌వ‌ర్సీ ఏం లేదు – డెకాయిట్ నుంచి శృతి హాస‌న్ త‌ప్పుకోవ‌డంపై అడివి శేష్ కామెంట్స్‌

శృతి హాస‌న్

Advertisement

Shruti Haasan |  అడివి శేష్ హీరోగా న‌టించిన డెకాయిట్ మూవీ వ‌చ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలో అడివి శేష్‌కు జోడీగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డెకాయిట్ షూటింగ్ మొద‌లై ఏడాదిపైనే అవుతోంది. సుదీర్ఘ కాలంగా చిత్రీక‌ర‌ణ‌ కొన‌సాగుతూనే ఉంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాస‌న్‌ను తీసుకున్నారు మేక‌ర్స్‌. అఫీషియ‌ల్‌గా పేరును అనౌన్స్‌చేయ‌డ‌మే కాకుండా అడివి శేష్ , శృతి హాస‌న్‌ల‌పై ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. కొన్నాళ్లు షూటింగ్‌లోనూ శృతి హాస‌న్ పాల్గొంది. స‌డెన్‌గా శృతి హాస‌న్ ఈ సినిమా నుంచి త‌ప్పుకొని మేక‌ర్స్‌కు షాకిచ్చింది. ఆమె ప్లేస్‌ను మృణాల్ ఠాకూర్‌తో భ‌ర్తీ చేశారు. శృతి హాస‌న్ డెకాయిట్ నుంచి ఎందుకు వైదొలిగింది అన్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. డెకాయిట్ మేక‌ర్స్‌తో పాటు శృతి హాస‌న్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఇష్యూపై రియాక్ట్ కాలేదు. శృతి హాస‌న్ త‌ప్పుకోలేద‌ని, ఆమెను త‌ప్పించారంటూ వార్త‌లు వినిపించాయి. అడివి శేష్‌తో ఏర్ప‌డిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్లే డెకాయిట్‌ను శృతి హాస‌న్ వ‌దులుకున్న‌ట్లు పుకార్లు వ‌చ్చాయి.

కూలీతో బిజీ...

ఎట్ట‌కేల‌కు ఈ సీక్రెట్‌పై ఓపెన్ అయ్యాడు అడివి శేష్. శృతి హాస‌న్ ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డం వెన‌కున్న కార‌ణాల‌ను రివీల్ చేశాడు. అంతా అనుకుంటున్న‌ట్లుగా ఇందులో ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీ లేద‌ని అడివి శేష్ పేర్కొన్నాడు. డెకాయిట్ అంగీక‌రించిన టైమ్‌లో కూలీ మూవీ షూటింగ్‌తో శృతి హాస‌న్ బిజీగా ఉంది. నేను సినిమా చేయ‌డానికి ఎక్కువ టైమ్ తీసుకుంటా. నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌ అంద‌రికి సింక్ కాదు. వాటికి తోడు ఇద్ద‌రి వైపు కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. వాటివ‌ల్లే శృతి హాస‌న్ డెకాయిట్ నుంచి వైదొలిగింది. ఫ్రెండ్లీగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఇందులో ఎలాంటి వివాదాలు లేవు అని అన్నారు.
శృతి హాస‌న్ ప్లేస్‌ను ఎవ‌రిని తీసుకోవాలా అని చాలా ఆలోచించాం. సీతారామంలో మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ మృణాల్‌ యాక్ష‌న్ రోల్ చేస్తుందా? లేదా? అనే అనుమానంతోనే ఆమెను అప్రోచ్ అయ్యాం. సాధార‌ణంగా బాలీవుడ్ హీరోయిన్లు క‌థ విన్న వారం త‌ర్వాతే సినిమాపై త‌మ డెసిష‌న్ చెబుతుంటారు. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం క‌థ చెప్పిన మూడు గంట‌ల త‌ర్వాత ఈ సినిమా చేస్తున్నానంటూ మెసేజ్ పెట్టింది. ఒక ర‌కంగా ఈ సినిమాలో నేను, మృణాల్ ఇద్ద‌రం హీరోల‌మే అని అడివి శేష్ అన్నాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ALSO READ Keerthy Suresh | పెళ్లి బ‌రాత్‌లో కీర్తి సురేష్ స్టెప్పులు – వీడియో వైర‌ల్‌
Advertisement

తాజావార్తలు

Advertisement