త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dacoit Movie | టాక్సిక్‌, ధురంధ‌ర్ 2తో బాక్సాఫీస్ వార్ – వెన‌క్కి త‌గ్గిన అడివి శేష్ – డెకాయిట్ పోస్ట్‌పోన్‌

అడ‌విశేష్ డెకాయిట్ పోస్ట్‌పోన్ అయ్యింది. మార్చి నుంచి ఏప్రిల్‌కు షిప్ట‌య్యింది. ర‌ణ‌వీర్‌సింగ్ ధురంధ‌ర్ 2తో పాటు య‌శ్ టాక్సిక్ తో బాక్సాఫీస్ పోటీ కార‌ణంగా ఈ సినిమా వెన‌క్కి త‌గ్గిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏదంటే?

N

Entertainment | Published On Feb 27, 2026, 8.47 pm IST

Dacoit Movie | టాక్సిక్‌, ధురంధ‌ర్ 2తో బాక్సాఫీస్ వార్ – వెన‌క్కి త‌గ్గిన అడివి శేష్ – డెకాయిట్ పోస్ట్‌పోన్‌
Advertisement

Dacoit Movie | మార్చిలో రిలీజ్ కావాల్సిన రామ్‌చ‌ర‌ణ్ పెద్ది, నాని ప్యార‌డైజ్ సినిమాలు పోస్ట్‌పోన్ అయ్యాయి. ఈ లిస్ట్‌లో తాజాగా అడివిశేష్ డెకాయిట్ కూడా చేరింది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని పోస్ట్‌పోన్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఏప్రిల్ 10న డెకాయిట్ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు వెల్ల‌డించారు.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో...

మార్చి 19న య‌శ్ టాక్సిక్‌తో పాటు ర‌ణ‌వీర్‌సింగ్ ధురంధ‌ర్ 2 రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల‌కు పోటీగా డెకాయిట్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. టాక్సిక్‌, ధురంధ‌ర్ 2 సినిమాల‌పై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా బ‌జ్ నెల‌కొంది. ఈ రెండు సినిమాల కార‌ణంగా డెకాయిట్‌కు థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మేనంటూ వార్త‌లొచ్చాయి. క‌లెక్ష‌న్స్‌పై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉండ‌టంతోనే మేక‌ర్స్ డెకాయిట్‌ను వాయిదా వేసిన‌ట్లు చెబుతున్నారు.

కెమెరామెన్‌...

డెకాయిట్ మూవీలో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ సినిమాకు షానీల్ డియో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌తంలో అడివిశేష్ హీరోగా న‌టించిన క్ష‌ణం, గూఢ‌చారి తో పాటు ప‌లు సినిమాల‌కు షానీల్ డియో కెమెరామెన్‌గా ప‌నిచేశాడు.

శృతి హాస‌న్ అనుకొని...

డెకాయిట్‌లో బాలీవుడ్ న‌టుడు అనురాగ్ క‌శ్య‌ప్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.ఈ సినిమా నుంచి రుబారూ అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు షానీల్ డియోతో క‌లిసి అడివి శేష్ క‌థ‌ను అందించారు. భీమ్స్ మ్యూజిక్ అందించాడు. గ్యానీ బీజీఎమ్ స‌మ‌కూర్చాడు. డెకాయిట్‌తో పాటు ప్ర‌స్తుతం గూఢ‌చారి 2 సినిమా చేస్తోన్నాడు అడివిశేష్‌. తొలుత ఈ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్‌గా అనుకున్నారు. క్రియేటివ్ ఢిఫ‌రెన్సెస్ కార‌ణంగా శృతి హాస‌న్ త‌ప్పుకోవ‌డంతో మృణాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.

Advertisement
Advertisement