Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ – నలుగురు హీరోయిన్లు – నాలుగు కథలు
బాలీవుడ్‌లో లస్ట్ స్టోరీస్ సినిమాలు వివాదాలతో పాటు ప్రశంసలు దక్కించుకున్నాయి. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలొచ్చాయి. తాజాగా లస్ట్ స్టోరీస్ 3 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బోల్డ్ ఆంథాలజీ మూవీ రాబోతుంది. ఇందులో అదితిరావ్ హైదరీ, రాధికా ఆప్టే, విజయ్ వర్మతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Entertainment | Published On Aug 24, 2026, 5.14 pm IST
Aditi Rao Hydari | బోల్డ్ కథలతో రూపొందిన లస్ట్ స్టోరీస్ ఆంథాలజీ సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. న్యూ ఏజ్ రిలేషన్‌షిప్స్‌ను బోల్డ్‌గా ఈ సినిమాల్లో చూపించారు. తాజాగా లస్ట్ స్టోరీస్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది.
లస్ట్ స్టోరీస్ 3 పేరుతో తెరకెక్కుతోన్న ఈ అంథాలజీ మూవీకి విక్రమాదిత్య మోత్వానీ, కిరణ్ రావ్, షౌకున్ బత్రా, విశాల్ భరద్వాజ్ దర్వకత్వం వహించబోతున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో....
లస్ట్ స్టోరీస్ 3 డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బోల్డ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18 లేదా 25న రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
బాలీవుడ్ స్టార్స్...
నాలుగు కథలతో తెరకెక్కుతోన్న ఈ ఆంథాలజీ మూవీలో ఆదితీరావ్ హైదరీ, రాధికా ఆప్టేలతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహిస్తున్న ఎపిసోడ్‌లో రాధికా ఆప్టే, కొంకనా సేన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షౌకున్ బత్రా కథలో అలీ ఫజల్, రాధికా మదన్, కిరణ్ రావ్ సెగ్మెంట్‌లో గురుఫతే ఫిర్జాదా, సన థంపి లీడ్ రోల్స్ చేస్తున్నారు. విశాల్ భరద్వాజ్ కథలో అదితీరావ్ హైదరీతో పాటు విజయ్ వర్మ జంటగా కనిపించనున్నారు.
మరింత బోల్డ్‌గా...
లస్ట్ స్టోరీస్ గత పార్ట్‌లకు మించి మరింత బోల్డ్‌గా లస్ట్ స్టోరీస్ 3 ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకున్న అదితిరావ్ హైదరీ సినిమాలను తగ్గించింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవలే గాంధీ టాక్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ – ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ
ఆగస్టు 23, 2026

Irumudi OTT | రవితేజ ఇరుముడి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆగస్టు 23, 2026

Taapsee | థియేటర్లలో కాదు…నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Ethanol | చక్కెర ధర పెరుగుదలను ఇథనాల్‌తో ముడిపెట్టొద్దు: నిపుణులు
- ●Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్
- ●Bhu Bharati Portal | భూభారతిలో రిజిస్ట్రేషన్ కాని భూములివే.. 22A జాబితా నుంచి మీ ల్యాండ్ తొలగించుకోండిలా!
- ●స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Ethanol | చక్కెర ధర పెరుగుదలను ఇథనాల్‌తో ముడిపెట్టొద్దు: నిపుణులు

Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్

Bhu Bharati Portal | భూభారతిలో రిజిస్ట్రేషన్ కాని భూములివే.. 22A జాబితా నుంచి మీ ల్యాండ్ తొలగించుకోండిలా!

స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?



