Mouni Roy | ఫొటోల పేరుతో నా నడుముపై చేయి వేశారు.. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన మౌనీరాయ్
Mouni Roy | బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హర్యానాలో తాత వయసున్న వ్యక్తి తనను లైంగికంగా వేధించారని, ఈ ఘటనతో పూర్తిగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
Entertainment | Published On Jan 24, 2026, 10.10 pm IST
Mouni Roy | బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హర్యానాలో తాత వయసున్న వ్యక్తి తనను లైంగికంగా వేధించారని, ఈ ఘటనతో పూర్తిగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు స్టోరీలనుషేర్ చేసింది. అందులో తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది. ‘ఇటీవల కర్నాల్‌లో ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ వచ్చిన అతిథుల ప్రవర్తన నాకు తీవ్ర నిరాశ కలిగించింది. ముఖ్యంగా తాతల వయసు ఉన్న ఇద్దరి ప్రవర్తన చాలా బాధించింది. ఈవెంట్ మొదలైన తర్వాత నేను స్టేజ్ వైపు వెళ్లగానే.. ఆ ఇద్దరు కుటుంబీల (అందరూ మగవారే)తో వచ్చి ఫొటోల పేరుతో నా నడుముపై చేతులు వేశారు. ‘సర్, దయచేసి చేతులు తీసేయండి’ అని చెబితే వారికి అది నచ్చలేదు’ అని మౌనిరాయ్ పేర్కొంది.

‘ఇద్దరూ తన ముందే నిలబడి అసభ్య వ్యాఖ్యలు చేయడం, అశ్లీల హావభావాలతో దూషించడం మొదలుపెట్టారు. నేను అది గమనించి మర్యాదగా అలా చేయవద్దని చెప్పాను. కానీ నాపై గులాబీ పూలు విసరడం మొదలుపెట్టారు. దాంతో నేను మధ్యలోనే బయటకు వెళ్లిపోయి.. మళ్లీ వచ్చి నా ప్రదర్శను పూర్తి చేశాను. అయినా కూడా వాళ్లు ఆగలేదు. కుటుంబీకులు గానీ, నిర్వాహకులు గాని వారిని వారించలేదు. స్టేజ్ ఎత్తులో ఉంటే కింది నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని.. వారిని ఆపమని ఎవరో చెప్పగానే, వారు నన్నే దూషించారు’ అంటూ వాపోయింది.

‘మేం కళాకారులమని.. ఆ కళతో నిజాయితీగా జీవనం కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి వ్యక్తుల స్నేహితులు, వారి కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు, కుటుంబీకులతో ప్రవర్తిస్తే వారికి ఎలా అనిపిస్తుందో ఊహించుకోండి. మీకు సిగ్గుండాలి. నాకు నా దేశం, నా ప్రజలు, నా సంప్రదాయాలు చాలా ఇష్టం. కానీ ఇది ఏం ప్రవర్తన? ఎంత నిస్సిగ్గు తనం! ఒక మగవాడిగా ఉండటంపై అహంకారం! నేను సాధారణంగా ఎప్పుడూ నెగటివ్‌గా ఏమీ రాయను. చాలా విషయాలను సహిస్తాను. కానీ, ఈ ఘటన విషయంలో నా దగ్గర మాటలు లేవు. నేను షాక్‌కు గురయ్యాను. అవమానంగా అనిపిస్తోంది. ఈ భరించలేని ప్రవర్తనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






