త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khushboo | ఖుష్బూ ఇంట పెళ్లి సంద‌డి – ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం – ఫొటోలు వైర‌ల్‌..

ఖుష్బూ కూతురు అవంతిక సుంద‌ర్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. శ్ర‌వ‌ణ్ శ్రీనివాస‌న్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతుంది. కూతురు పెళ్లి శుభ‌లేఖ‌ను భ‌ర్త సుంద‌ర్‌తో క‌లిసి ప్ర‌ధాని మోదీకి అంద‌చేసింది ఖుష్బూ. మోదీని క‌లిసిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

N

Entertainment | Published On May 29, 2026, 8.07 pm IST

Khushboo | ఖుష్బూ ఇంట పెళ్లి సంద‌డి – ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం – ఫొటోలు వైర‌ల్‌..
Advertisement

Khushboo | సీనియ‌ర్ హీరోయిన్‌ ఖుష్బూ ఇంట పెళ్లి సంద‌డి మొద‌లుకాబోతుంది. ఖుష్బూ కూతురు అవంతిక సుంద‌ర్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. శ్ర‌వ‌ణ్ శ్రీనివాస‌న్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతుంది. కూతురు పెళ్లికి ప్ర‌ధాని మోదీని ఆహ్వానించారు ఖుష్బూ, డైరెక్ట‌ర్ సుంద‌ర్ దంప‌తులు. కూతురు, కాబోయే అల్లుడితో క‌లిసి శుక్ర‌వారం ప్రైమ్ మినిస్ట‌ర్ మోదీని ఖుష్బూ, సుంద‌ర్ క‌లిశారు. పెళ్లి కార్డును మోదీకి అంద‌జేశారు. మోదీని క‌లిసిన ఫొటోల‌ను ఖుష్బూ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

మోదీకి కృత‌జ్ఞ‌త‌లు...

కూతురి పెళ్లి ఎప్పుడ‌న్న‌ది మాత్రం ఖుష్బూ వెల్ల‌డించ‌లేదు. బిజీ షెడ్యూల్స్‌లో కూడా త‌మ కోసం టైమ్ కేటాయించ‌డ‌మే కాకుండా కూతురు, అల్లుడిని ఆశీర్వ‌దించిన ప్ర‌ధాని మోదీకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది ఖుష్బూ.

హీరోయిన్‌గా ఎంట్రీ....

ఖుష్బూ కూతురు అవంతిక సుంద‌ర్ త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ప్ర‌స్తుతం ఆరంభం పేరుతో త‌మిళం, మ‌ల‌యాళ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తోంది. అలాగే ధ‌నుష్ మేన‌ల్లుడితో కోలీవుడ్‌లో ఓ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

 

 

Advertisement
Advertisement