త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavya Kalyanram | త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ‘బలగం’ కావ్య..! వరుడు ఎవరో తెలుసా..?

Kavya Kalyanram | టాలీవుడ్‌లో మరో యంగ్‌ హీరోయిన్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రష్మిక మందన్నా-విజయ్‌ దేవరకొండ పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. అలాగే, మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సైతం ఓ ఇంటివాడు కానున్నాడు. కార్తీరెడ్డిని ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో బలగం బ్యూటీ కావ్య కల్యాణ్‌రామ్‌ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.

P

Entertainment | Published On Mar 11, 2026, 4.32 pm IST

Kavya Kalyanram | త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ‘బలగం’ కావ్య..! వరుడు ఎవరో తెలుసా..?
Advertisement

Kavya Kalyanram | టాలీవుడ్‌లో మరో యంగ్‌ హీరోయిన్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రష్మిక మందన్నా-విజయ్‌ దేవరకొండ పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. అలాగే, మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సైతం ఓ ఇంటివాడు కానున్నాడు. కార్తీరెడ్డిని ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో బలగం బ్యూటీ కావ్య కల్యాణ్‌రామ్‌ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే పని చేస్తున్న ఓ యువ సంగీత దర్శకుడితో కావ్య పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ.

ఇద్దరు గతకాలంగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. ‘ఉస్తాద్’ మూవీ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని.. అదికాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లికి పెళ్లికి రెండు కుటుంబాలు సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్‌. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్తగూడెంకు చెందిన కావ్య కల్యాణ్‌రామ్‌ చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తిని పెంచుకుంది. ఆమె కుటుంబం చాలా సంవత్సరాల కిందటే హైదరాబాద్‌లోనే స్థిరపడింది. కావ్య బాలనటిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2001లో స్నేహమంటే ఇదేరా మూవీతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత గంగోత్రి, ఠాగూర్‌, అడవిరాముడు, లేత మనసులు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, పాండురంగడు తదితర మూవీల్లో నటించింది. అలాగే, మసూద మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్‌ కమెడియన్‌ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ మూవీతో మంచి గుర్తింపును సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. వాస్తవానికి ఈ మూవీ హిట్‌గా నిలువడంతో ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ, ఆమె ఆశ నిరాశే అయ్యింది. ప్రస్తుతం వాట్సాప్‌ నరేశ్ మూవీలో నటిస్తోంది. ఇక కాలభైరవ సింగర్‌, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. బాహుబ‌లి-2’లో ‘దండాల‌య్యా’ పాటతో మంచి గుర్తింపు పొందాడు. 2019లో వచ్చిన ‘మత్తు వదలరా’ మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ గెలిచింది. అదే సినిమాలోని ‘కొమురం భీముడో’ సాంగ్‌కు కాలభైరవకు జాతీయ అవార్డును దక్కింది.

Read Also :

నాలుగేళ్ల బంధానికి తెర‌..! సోహైల్‌తో విడాకులు తీసుకున్న హ‌న్సిక మోత్వాని..!

Vijay – Trisha | ర‌చ్చ చేయాల్సిన అవ‌స‌రం లేదు – విజ‌య్‌, త్రిష వ్య‌వ‌హారంపై ఖుష్బూ రియాక్ష‌న్‌

Sai Dhanshika | ఓటీటీలోకి హీరో విశాల్‌కు కాబోయే భార్య త‌మిళ మూవీ

Advertisement
Advertisement