Hansika Motwani | నాలుగేళ్ల బంధానికి తెర..! సోహైల్‌తో విడాకులు తీసుకున్న హన్సిక మోత్వాని..!
Hansika Motwani | ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్స్ సర్వసాధారణం. ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోయాయి. తాజాగా ఈ జాబితాలో హన్సిక మోత్వాని సైతం చేరింది. తన భర్త వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియాతో డివోర్స్ తీసుకుంది.
Entertainment | Published On Mar 11, 2026, 4.22 pm IST
Hansika Motwani | ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్స్ సర్వసాధారణం. ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోయాయి. తాజాగా ఈ జాబితాలో హన్సిక మోత్వాని సైతం చేరింది. తన భర్త వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియాతో డివోర్స్ తీసుకుంది. గత కొంతకాలంగా వీరి వివాహ జీవితంలో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. హన్సిక-సోహైల్ దంపతులకు ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దాంతో వీరిద్దరి నాలుగేళ్ల బంధానికి తెరపడినట్లయ్యింది.
2022 పెళ్లి..
2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త అయితన సోహైల్‌ను హన్సిక ఘనంగా వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన కొద్దికాలానికే వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సోహైల్‌కు ఇది రెండో వివాహం. అంతకు ముందు హన్సిక స్నేహితురాలు రింకీ బజాజ్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హన్సిక–సోహైల్ విడాకులకు అసలు కారణం తెలియరాలేదు. గత రెండేళ్లుగా వారి వైవాహిక జీవితం ఇబ్బందికరంగానే సాగిందని సమాచారం. ఈ క్రమంలో 2024 జులై నుంచి ఇద్దరు వేర్వేరుగా కాపురం ఉంటున్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
గొడవలతోనే..
చిన్నచిన్న విషయాలపై తరచూ గొడవలు జరగడం కూడా విభేదాలకు కారణమైనట్లు సమాచారం. విడాకుల సమయంలో హన్సిక ఎలాంటి భరణం (అలిమోని) కోరలేదని తెలుస్తోంది. కోర్టు విచారణ సందర్భంగా హన్సిక తరఫు న్యాయవాది అద్నాన్ షేక్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత కొంతకాలం ఇద్దరు కలిసి నివసించారని తెలిపారు. కాలక్రమేణా వారి ఆలోచనలు, స్వభావం, జీవనశైలి భిన్నంగా ఉన్నాయని ఇద్దరికీ అర్థమైందన్నారు. చిన్నచిన్న విషయాలపైనా ప్రతిరోజూ తగాదాలు జరుగుతుండడడంతో ఒకే ఇంట్లో జీవించడం కష్టంగా మారిందని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
బాలనటిగా..
హన్సిక బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ప్రముఖ టీవీ సీరియల్ షకలక బుమ్ బుమ్ సిరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం హృతిక్ రోషన్ నటించిన కొయి మిల్ గయా చిత్రంలోనూ నటించింది. 2007లో తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి హన్సికకు ఉత్తమ డెబ్యూ నటి అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
Read Also :
Vijay – Trisha | రచ్చ చేయాల్సిన అవసరం లేదు – విజయ్, త్రిష వ్యవహారంపై ఖుష్బూ రియాక్షన్
Sai Dhanshika | ఓటీటీలోకి హీరో విశాల్‌కు కాబోయే భార్య తమిళ మూవీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



