Actress Hema | నిజాలు తెలుసుకోకుండా నా ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగారు …డ్రగ్స్ కేసుపై హేమ కామెంట్స్
డ్రగ్స్ కేసులో గత ఏడాది నవంబర్‌లోనే తనకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని నటి హేమ అన్నది. డ్రగ్స్ కేసుకు సంబంధించి నిజానిజాలు తెలుసుకోకుండా తనను తన, ఫ్యామిలీని చాలా ఇబ్బందులకు గురిచేశారని హేమ అన్నది.
Entertainment | Published On Mar 30, 2026, 3.16 pm IST
Actress Hema | డ్రగ్స్ కేసులో నిజానిజాలు తెలుసుకోకుండా తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని సినీ నటి హేమ అన్నది. తన ఫ్యామలీని నడి రోడ్డు మీదకు లాగారని అన్నది. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం గత ఏడాది నవంబర్‌లోనే కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని హేమ తెలిపింది. సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో హేమ ముచ్చటించింది. డ్రగ్స్ కేసు కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది.
ఆధారాలు సమర్పించా...
"డ్రగ్స్ కేసు బయటపడ్డ రోజు నాకు మూడు వందల కాల్స్ వచ్చాయి. కేసుతో నాకు సంబంధం ఉంటే అంత మందితో నేను ఎలా మాట్లాడుతాను. . బెంగళూరు పోలీస్ స్టేషన్‌కు నేను ఒక్కదానినే వెళ్లాను. నేను నిజంగా తప్పు చేసుంటే లాయర్లను తీసుకొని వెళ్లేదానిని. పోలీసులు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చాలా మందికి తెలియదు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి నాకు పోలీసులు నోటీసులు పంపించారు. నా ఆరోగ్యం బాగాలేదని, తర్వాత కలుస్తానని చెప్పాను. అయినా వినకుండా నోటీసులకు సరిగ్గా రెస్పాండ్ కాలేదంటూ నన్ను అరెస్ట్ చేశారు. నేనేం తప్పు చేయలేదని పోలీసులుకు చెప్పా. నా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం వారికి సమర్పించాను" అని హేమ అన్నది.
నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు..
"డ్రగ్స్ కేసులో నా పేరు ఉన్నట్లు ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పలేదు. ఆధారాలు ఉంటే ఎవరైనా చూపించవచ్చు. రేవ్ పార్టీలో బ్లాక్ డ్రెస్‌లో ఉన్నది నేనేనంటూ ప్రచారం చేశాను. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్లలేదు. ఇంట్లోనే ఉన్నానని ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదని చెప్పిన ఎవరూ వినలేదు. నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. మా కుటుంబాన్ని నడి రోడ్డు మీదకు లాగారు. మా అమ్మను చాలా మాటలు అన్నారు. ఈ అబద్దపు ప్రచారాలు, నిందల వల్ల చచ్చిపోదామని" అనుకున్నానని నటి హేమ అన్నది.
క్లీన్ చిట్ వచ్చింది...
"జూన్‌లో పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఆ టైమ్‌లో నాకు టెస్ట్‌లు నిర్వహించారు. రిజల్ట్ రావడానికి పదిహేను రోజులు టైమ్ పడుతుందని చెప్పడానికి ప్రయత్నించిన వినకుండా నాకు డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిందంటూ తప్పుడు కథనాలు అల్లారు.నవంబర్‌లో డ్రగ్స్ కేసు నుంచి నాకు క్లీన్ చిట్ వచ్చింది. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. నిజానిజాలు తెలియకుండా బురద చల్లడం సరికాదు. నేను బయట తిరుగుతాను. పార్టీలకు వెళతాను. నా లైఫ్ నా ఇష్టం. చట్ట విరుద్దమైన పనులు మాత్రం చేయను. నాకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా బతుకుతానని చెబితే దానిని బూతులా మార్చేశారు" అంటూ హేమ అన్నది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



