త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shivaji | మంచి మాటలు చెప్పాలనుకున్నా – క్ష‌మించండి – వివాదంపై దిగొచ్చిన శివాజీ

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెల‌రేగిన వివాదానికి శివాజీ పుల్‌స్టాప్ పెట్టారు. హీరోయిన్ల డ్రెస్‌ల‌పై శివాజీ చేసిన కామెంట్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై శివాజీ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఎవ‌రిని అవ‌మానించాల‌ని ఈ కామెంట్స్ చేయ‌లేదంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Dec 23, 2025, 7.25 pm IST

Shivaji | మంచి మాటలు చెప్పాలనుకున్నా  – క్ష‌మించండి – వివాదంపై దిగొచ్చిన శివాజీ
Advertisement

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల‌పై శివాజీ చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్నే రేపాయి. శివాజీపై ప‌లువురు హీరోయిన్లతో పాటు టాలీవుడ్ సెలిబ్రిటీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అత‌డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ వివాదం ముద‌ర‌డంతో శివాజీ దిగొచ్చారు. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మంచి చెప్పాల‌నే ఉద్దేశమే త‌ప్పితే ఎవ‌రిని అవ‌మానించాల‌ని, కించ‌ప‌ర‌చాల‌ని ఆ కామెంట్స్ చేయ‌లేద‌ని ఈ వీడియోలో శివాజీ చెప్పారు. "హీరోయిన్లు ఈ మ‌ధ్య కాలంలో ఇబ్బంది ప‌డ్డ సంద‌ర్భాల‌ను దృష్టిలో పెట్టుకొని దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాలుగు మంచి మాట‌లు చెప్పాల‌ని అనుకున్నా. ఈ క్ర‌మంలో రెండు అభ్యంత‌రక‌ర‌ మాట‌లు వాడాను. ఆ మాట‌ల వ‌ల్ల కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. నేను మాట్లాడింది అంద‌రూ అమ్మాయిలను ఉద్దేశించి కాదు. హీరోయిన్లు బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు బ‌ట్ట‌లు జాగ్ర‌త్త‌గా ఉంటే వారికే ఇబ్బంది ఉండ‌దేమోన‌నే ఉద్దేశం త‌ప్పితే ఎవ‌రిని అవ‌మానించాల‌ని అనుకోలేదు. నా కామెంట్ల‌పై అంద‌రికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా" అని శివాజీ అన్నారు.

ఆలోచ‌న మంచిదే...

అంతే కాకుండా "స్త్రీ అంటే మ‌హాశ‌క్తి. ఒక అమ్మవారిలానే భావిస్తుంటా. ఇవాళ స‌మాజంలో స్త్రీని ఎంత చుల‌క‌న‌గా చూస్తున్నారో అంద‌రం చూస్తున్నాం. అలాంటి అవ‌కాశం ఇవ్వొద్దు అనే చెప్పాల‌నే ప్ర‌య‌త్నంలో ఊరు భాష మాట్లాడాను. అది చాలా త‌ప్పు. నా ఆలోచ‌న మంచిదే కానీ కానీ ఆ రెండు ప‌దాలు దొర్ల‌కుండా ఉంటే ఈరోజు ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదు. మంచి చెప్పాల‌నే ఉద్దేశ‌మే త‌ప్పితే ఎవ‌రిని కించ‌ప‌ర‌చాల‌ని, అవ‌మాన‌ప‌ర‌చాల‌ని అనుకోలేదు. నా మాట‌ల వ‌ల్ల సినిమా ఇండ‌స్ట్రీలోని చాలా మంది మ‌హిళ‌ల‌ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. బాధ‌ప‌డ్డ మ‌హిళ‌లంద‌రికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా" అని శివాజీ అన్నారు.
శివాజీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ ప‌డుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. శివాజీపై యాక్ష‌న్ తీసుకోవాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అత‌డిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌డానికి రెడీ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.\

Advertisement

తాజావార్తలు

Advertisement