Prakash Raj | సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు మాతృవియోగం
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) సోమవారం ఉదయం కన్నుమూశారు.
Entertainment | Published On Mar 30, 2026, 10.50 am IST
Prakash Raj | సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట విషాదం నెలకొంది. ప్రకాష్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత (86) సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో సువర్ణలత అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మరణంతో ప్రకాష్ రాజ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ప్రకాష్ రాజ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ప్రేమ వివాహం...
ప్రకాష్ రాజ్ తండ్రి మంజునాథ్ రాయ్ తుళువ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. క్రిస్టియన్ అయిన సువర్ణలతను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనాథ అయిన సువర్ణలత ఓ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసేవారట. ఆమె పనిచేస్తున్న హాస్పిటల్‌కు ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన మంజునాథ్‌రాయ్...సువర్ణలతతో ప్రేమలో పడ్డారటా. ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇంట్లో హిందూ మతంతో పాటు క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ చెప్పారు.
మంజునాథ్‌రాయ్, సువర్ణలత దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ప్రకాష్ రాజ్ తమ్ముడు ప్రసాద్ రాజ్ కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



