త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Arjun | విడాకులు తీసుకోనున్న టాలీవుడ్ హీరో కూతురు – రూమ‌ర్ల‌పై క్లారిటీ

అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య అర్జున్ విడాకులు తీసుకోబోతున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. విభేదాల కార‌ణంగా భ‌ర్త ఉమాప‌తి రామ‌య్య నుంచి ఐశ్వ‌ర్య దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై ఐశ్వ‌ర్య తండ్రి, టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్ రియాక్ట్ అయ్యారు.

N

Entertainment | Published On Nov 19, 2026, 4.00 pm IST

Aishwarya Arjun | విడాకులు తీసుకోనున్న టాలీవుడ్ హీరో కూతురు – రూమ‌ర్ల‌పై క్లారిటీ
Advertisement

Aishwarya Arjun  టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య విడాకులు తీసుకోనున్న‌ట్లు కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల అర్జున్ చిన్న కూతురు అంజ‌న పెళ్లి ఇట‌లీలో జ‌రిగింది. ఈ వేడుకలో ఐశ్వ‌ర్య ఒంట‌రిగా క‌నిపించింది. ఆమె భ‌ర్త, న‌టుడు ఉమాప‌తి రామ‌య్య‌తో పాటు అత‌డి కుటుంబ‌స‌భ్యులు ఎవ‌రూ అర్జున్ కూతురు పెళ్లికి హాజ‌రుకాక‌పోవ‌డంతో విడాకుల రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. విభేదాల కార‌ణంగా ఐశ్వ‌ర్య‌, ఉమాప‌తి విడిపోయార‌ని, గ‌త కొద్ది నెల‌లుగా వేర్వురుగా ఉంటున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వీరిద్ద‌రు విడాకుల‌కు అప్ల‌య్ చేశారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

క‌ట్టు క‌థ‌లు...

ఈ రూమ‌ర్ల‌పై ఐశ్వ‌ర్య తండ్రి అర్జున్ క్లారిటీ ఇచ్చారు. త‌న కూతురి వ్య‌క్తిగ‌త జీవితంపై వ‌స్తోన్న వార్త‌ల‌న్నీ నిరాధారాలేన‌ని కొట్టిప‌డేశారు. కూతురి జీవితం, ఆమె వ్య‌క్తిత్వాన్ని గురించి త‌ప్పుగా మాట్లాడుతుంటే మౌనంగా ఉండ‌లేకపోయాన‌ని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఐశ్వ‌ర్య‌పై ఆల్క‌హాలిక్ అంటూ ముద్ర‌లు వేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అర్జున్‌.

పుకార్లు స‌హ‌జం కానీ...

"న‌టీన‌టుల జీవితాల‌పై పుకార్లు, విమ‌ర్శ‌లు రావ‌డం స‌హ‌జం. కానీ లేనిపోని క‌ట్టు క‌థ‌లు, క‌ల్పితాలు అల్లి నిరాధార వార్త‌ల‌ను వ్యాప్తి చేయ‌డం మాత్రం క‌రెక్ట్ కాదు. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ మ‌హిళ వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచ‌డం ఎంత మాత్రం ఆమోద‌యోగ్యం కాదు" అని అర్జున్ పేర్కొన్నారు.

వ్య‌క్తిత్వ హ‌న‌నం...

"ఐశ్వ‌ర్య వ్య‌క్తిగ‌త జీవితంపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి ఈ ఆరోప‌ణ‌ల‌పై రియాక్ట్ కాకూడ‌ద‌ని అనుకున్నాం. కానీ ఆల్కాహాలిక్ అంటూ ముద్ర‌లు వేస్తున్నారు. మా మౌనాన్ని అలుసుగా తీసుకుంటూ వ్య‌క్తిత్వ హ‌ననానికి పాల్ప‌డుతున్నారు. ఐశ్వ‌ర్యపై హేయ‌మైన కామెంట్లు చేస్తున్నారు. ఇక‌పై ఈ రూమ‌ర్ల‌ను చ‌ట్ట‌ప‌రంగానే ఎదుర్కొంటాం. క‌ల్పిత వార్త‌ల‌ను వ్యాప్తి చేస్తోన్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. ఇలాంటి అస‌త్యాలు, అబ‌ద్ద‌పు వార్త‌ల వ‌ల్ల ఇప్ప‌టికే క‌ష్టాల్లో ఉన్న మ‌హిళ‌ల జీవితాలు మ‌రింత క‌ఠినంగా మారుతాయి. ప్ర‌తి మ‌హిళ‌కు సొంత నిర్ణ‌యాలు తీసుకునే హ‌క్కు, త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా జీవించే స్వేచ్చ ఉన్నాయి. నా కూతురు నిర్ణ‌యం ఏదైనా ఆమెకు నాతో పాటు మా కుటుంబం మొత్తం అండ‌గా ఉంటుంది" అని అర్జున్ అన్నారు. ఐశ్వ‌ర్య గోప్య‌త‌ను గౌర‌విస్తూ ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై మాత్రం తాను ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని ఈ లేఖ‌లో అర్జున్ పేర్కొన్నారు.  స‌మాధానం చెప్పాల్సిన రోజు వ‌స్తే ఐశ్వ‌ర్య  త‌ప్ప‌కుండా వీటిపై మాట్లాడుతుంద‌ని అర్జున్ ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. విడాకుల ప్ర‌స్తావ‌న‌గాని, అల్లుడు ఉమాప‌తి గురించి గానీ అర్జున్ ఈ లేఖ‌లో ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

హీరోయిన్‌గా...

హీరోయిన్‌గా త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఐశ్వ‌ర్య మూడు సినిమాలు చేసింది. ఈ ఏడాదే సీతాప‌య‌ణం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌మిళ‌న‌టుడు డైరెక్ట‌ర్ ఉమాప‌తి రామ‌య్య‌తో ఐశ్వ‌ర్య‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో 2024లో పెళ్లిచేసుకున్నారు.

 

Advertisement
Advertisement