Kollywood | బాక్సాఫీస్ వద్ద భార్య సినిమాతో భర్త పోటీ – కోలీవుడ్‌లో ఫస్ట్ టైమ్
ఈ వారం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భార్యభర్తల తమ సినిమాలతో పోటీపడబోతున్నారు. రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాయ్ కిళవి, శరత్ కుమార్ అజి సినిమాలు ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.
Entertainment | Published On Feb 24, 2026, 11.30 am IST
Kollywood | ఈ వారం కోలీవుడ్‌లో రిలీజ్ కాబోతున్న రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలు తమిళంలో ఉన్నాయి. కానీ ఫస్ట్ టైమ్ భార్యభర్తలు బాక్సాఫీస్ వద్ద ఒకరి సినిమాతో మరొకరు పోటీపడనుండటం ఆసక్తికరంగా మారింది.
అజి వర్సెస్ తాయ్ కిళవి...
శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఆజి, రాధిక శరత్‌కుమార్ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్న తాయ్ కిళవి ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతున్నాయి. ఈ భార్యాభర్తల్లో ఎవరూ విజేతగా నిలుస్తారు? ఏ సినిమా హిట్టవుతుందన్నది కోలీవుడ్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠను పంచుతోంది.
శివకార్తికేయన్ ప్రొడ్యూసర్...
రాధిక ముఖ్య పాత్రలో నటించిన తాయ్ కిళవి సినిమాకు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాత కావడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రాధిక లుక్, ఈ పాత్ర కోసం ఆమె మేకోవర్ అయిన తీరు కూడా ఆడియెన్స్‌లో ఆసక్తికరంగా మారింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తాయ్ కిళవిలో ఊరిపెద్దగా 75 ఏళ్ల వయసుపై బడిన వృద్ధురాలి పాత్రలో డీ గ్లామర్ లుక్‌లో రాధిక కనిపించబోతుంది.
కమల్ హాసన్ ప్రశంసలు...
ఫస్ట్ లుక్ రిలీజైన సమయంలో రాధికను చాలా మంది ఫ్యాన్స్ గుర్తుపట్టలేకపోయారు. ఈ సినిమా కోసం ప్రతి రోజు ఐదు గంటలు మేకప్ వేసుకోవాల్సివచ్చిందని ప్రమోషన్స్లో రాధిక అన్నది. ఇటీవల ఈ సినిమా చూసిన స్టార్ హీరో కమల్‌హాసన్...రాధిక యాక్టింగ్‌పై పొగడ్తలు కురిపించారు. శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సత్యరాజ్ కీలక పాత్రలో నటించాడు. పుష్ప ఫేమ్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు.
సర్వైవల్ థ్రిల్లర్...
శరత్‌కుమార్ అజి సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్నట్లుగా టీజర్, ట్రైలర్స్ ద్వారా మేకర్స్ చూపించారు. తండ్రీ కూతుళ్ల బంధానికి యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్టర్ మాధవ్ రామ్‌దాస్ ఈ మూవీని తెరకెక్కించారు. జెస్సీ గిఫ్ట్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి ఆస్కార్ సౌండ్ డిజైనర్ రసూల్ పోకూట్టి పనిచేశారు. ఈ సినిమా కథ చాలా వరకు సముద్రంలోనే సాగనున్నట్లు ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించారు. ఇందులో శరత్‌కుమార్ ఓ ఎమోషనల్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samantha | లెనిన్ వర్సెస్ మా ఇంటి బంగారం – అక్కినేని హీరోకు పోటీగా సమంత మూవీ రిలీజ్!
మే 7, 2026

Bhagyashri Borse | వరుసగా నాలుగు డిజాస్టర్లు – అయినా భాగ్యశ్రీ క్రేజ్ తగ్గలేదు
ఏప్రిల్ 11, 2026

Ar Murugadoss | శివకార్తికేయన్ సినిమాకు నష్టాలు – దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై నిర్మాత కంప్లైంట్
మార్చి 29, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



