Tamannaah | తనకన్న వయసులో చిన్నవాడైన హీరోతో మిల్కీ బ్యూటీ రొమాన్స్
ఓ బాలీవుడ్ మూవీలో తన కంటే వయసులో చిన్నవాడైన హీరోతో మిల్కీ బ్యూటీ జోడీ కట్టబోతుంది. బోల్డ్ హారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌తో పాటు డైరెక్టర్ ఎవరన్నది రివీలైంది.
Entertainment | Published On May 9, 2026, 1.39 pm IST
Tamannaah | బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మామూలుగా లేదు. ఓ పెద్ద హిట్టు అందుకొని చాలా ఏళ్లయ్యింది. అయినా తమన్నాకు అవకాశాలకు కొదవ లేదు. తాజాగా బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకుంది. బోల్డ్ మూవీ ఫ్రాంచైజ్‌లో హీరోయిన్‌గా కనిపించబోతుంది.
మూడో పార్ట్...
బాలీవుడ్‌లో బోల్డ్ హారర్ మూవీస్‌గా రూపొందిన రాగిణి ఎంఎంఎస్, రాగిణి ఎంఎంఎస్ 2 సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా భారీగా వసూళ్లను రాబట్టాయి. తాజాగా రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది. రాగిణి 3 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా ఎంపికైంది.
ఆయుష్ శర్మ...
శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎక్తా కపూర్ నిర్మిస్తోంది. ఈ బోల్డ్ మూవీలో తమన్నాకు జోడీగా ఆయుష్ శర్మ హీరోగా కనిపించబోతున్నాడు. ఏజ్ పరంగా తమన్నా కంటే ఆయుష్ శర్మ చిన్నవాడు కావడం గమనార్హం. తమన్నా వయసు 36 ఏళ్లు కాగా...ఆయుష్ శర్మ ఏజ్ ముప్ఫై ఐదే. తనకంటే ఏడాది చిన్నవాడైన హీరోతో రాగిణి 3లో తమన్నా జోడీగా నటించనుండటం ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఏడాది రిలీజ్...
రాగిణి 3లో జునైద్ ఖాన్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా మోడ్రన్ అమ్మాయిగా, ఆత్మగా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టి వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రొడక్షన్ హౌజ్ ప్రకటించింది.
సల్మాన్ బావ...ఆమిర్ కొడుకు...
సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ భర్తగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయుష్ శర్మ. లవ్ యాత్రి, అంతిమ్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. మరోవైపు ఆమిర్‌ఖాన్ తనయుడైన జునైద్ ఖాన్ ఇటీవలే ఎక్ దిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ బావ, ఆమిర్ ఖాన్ కొడుకు ఇద్దరు రాగిణి 3లో నటించనుండటం కూడా బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



