Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. జయం రవి నుంచి నెలకు నలభై లక్షలు భరణం డిమాండ్ చేస్తూ ఆర్తి రవి పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు వీరి విడాకుల వ్యవహారంలో కోలీవుడ్ స్టార్ హీరో పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On May 19, 2026, 3.47 pm IST
Jayam Ravi | కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. భార్య ఆర్తి రవిపై ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు జయం రవి. ఆర్తి తనను బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని, పిల్లలను చూడనివ్వడం లేదని అన్నారు. తన ఆస్తి మొత్తం లాక్కొని ఇంటి నుంచి బయటకు గెంటేసిందని, ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు చెప్పాడు. కష్ట సమయంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన కెనీషాపై బెదిరింపులకు పాల్పడిందని జయం రవి అన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్ అయిన జయం రవి కన్నీళ్లు పెట్టుకున్నారు.
నలభై లక్షల భరణం...
2024లో భార్య నుంచి విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించాడు. గత ఏడాది ఆర్తి నుంచి విడాకులు కోరుతూ కోలీవుడ్ హీరో చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆర్తి రవి మాత్రం భర్త విడాకుల పిటిషన్‌ను రద్దు చేస్తూ జయం రవి తనతోనే కలిసి ఉండేలా చూడాలంటూ కోర్టును కోరింది. ఆర్తి వాదనతో జయం రవి ఏకీభవించలేదు.. కలిసి ఉండటం అసాధ్యమని, విడాకులే కావాలని పట్టుపట్టాడు. దాంతో ఆర్తి తనకు భరణంగా నెలకు నలభై లక్షలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. వీరి విడాకులపై జూన్ 12న తదుపరి విచారణ జరుగనుంది.
జయం రవికి సపోర్ట్...
ఆర్తి భరణం డిమాండ్‌పై సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జయం రవిని సపోర్ట్ చేస్తోన్న నెటిజన్లు ఆర్తిని ట్రోల్ చేస్తున్నారు. జయం రవి రెమ్యూనరేషన్ కూడా నెలకు నలభై లక్షలు ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు జయం రవి ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాను పూర్తిచేయడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు టైమ్ పడుతుంది. పారితోషికాన్ని నెలవారీగా లెక్కేసుకున్నా కూడా నలభై నుంచి యాభై లక్షల వరకు వరకే ఉంటుందని, అలాంటప్పుడు అంత పెద్ద మొత్తం భరణంగా ఎలా ఇస్తాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. మరోవైపు విడాకులు వచ్చే వరకు తాను సినిమాలు చేయనని జయం ప్రకటించాడు.
స్టార్ హీరో పేరు...
జయం రవి విడాకుల వ్యవహారంలో ఓ కోలీవుడ్ టాప్ హీరో పేరు వినిపిస్తోంది. ఆర్తి రవితో ఆ తమిళ హీరో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అతడి వల్లే జయం రవి, అర్తి మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం. కోలీవుడ్ అగ్ర హీరో కూతురిని పెళ్లి చేసుకున్న సదరు స్టార్... రెండేళ్ల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను అతడు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Trisha | రాజకీయాల్లోకి త్రిష? – తమిళనాడులో వెలిసిన బ్యానర్లు – డీఎంకే సభలో చెన్నై క్వీన్ హవా
ఆగస్టు 3, 2026

Jayam Ravi | 40 లక్షలు అందుకే అడిగాం – దళపతి విజయ్‌ని చూసి నేర్చుకో – జయం రవిపై ఆర్తి తల్లి కామెంట్లు
ఆగస్టు 3, 2026

Vijay Trisha | విజయ్, త్రిష బ్లాక్‌బస్టర్ మూవీ 21 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ రిలీజ్ – తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే డిజాస్టర్
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్
- ●PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి
- ●Warren Buffett | రోజూ ట్రేడింగ్ చేసేవారికి వారెన్ బఫెట్ కీలక సూచనలు
- ●BJP | జెన్ జీ దెబ్బకు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓటమి
- ●Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ - ఇప్పుడు ప్రొడ్యూసర్ - నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
- ●FSSAI Norm Violations | మద్యం ప్రియులకు బిగ్ అలెర్ట్.. మూడు కంపెనీల లిక్కర్‌పై నిషేధం..!

Dasoju Sravan | రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్

PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి

Warren Buffett | రోజూ ట్రేడింగ్ చేసేవారికి వారెన్ బఫెట్ కీలక సూచనలు

BJP | జెన్ జీ దెబ్బకు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓటమి



