Aamir Khan | టీమిండియా క్రికెటర్ బయోపిక్‌లో ఆమిర్‌ఖాన్ … ఇండియా – పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ బ్యాక్‌డ్రాప్‌లో
టీమిండియా లెజెండరీ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ జీవితం వెండితెరపైకి రాబోతుంది. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఫస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ దిగ్గజ క్రికెటర్ బయోపిక్‌లో ఆమిర్‌ఖాన్ హీరోగా నటించబోతున్నాడు. 1952 లో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ బాలీవుడ్ మూవీ రూపొందనుందట.
Entertainment | Published On May 28, 2026, 2.31 pm IST
Aamir Khan | లగాన్ తర్వాత బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా చేయబోతున్నాడు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన లాలా అమర్‌నాథ్ జీవితం ఆధారంగా ఓ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అషుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించబోతున్నాడట. అమిర్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కనిపించబోతున్నట్లు సమాచారం.
తొలి సిరీస్...
భారత క్రికెట్‌కు పితామహుడిగా లాలా అమర్‌నాథ్‌ను అభివర్ణిస్తుంటారు. 1933లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అమర్‌నాథ్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. స్వాతంత్య్రానంతరం ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఫస్ట్ కెప్టెన్‌గా అమర్‌నాథ్ వ్యవహరించారు. 1952లో లాలా అమర్‌నాథ్ సారథ్యంలోనే పాకిస్థాన్‌పై ఇండియా తన తొలి టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. ఈ ఇండియా పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఆమిర్‌ఖాన్ మూవీ తెరకెక్కనుందట. పాకిస్థాన్‌పై టెస్ట్ సిరీస్ విజయంలో లాలా అమర్‌నాథ్ పాత్ర ఏమిటి? కష్టాల్లో ఉన్న టీమిండియాలో అతడు ఎలా స్ఫూర్తిని నింపాడు? ఓటమి దశలో ఉన్న భారత జట్టును తన అసమాన ఆటతీరుతో ఎలా విజయతీరాలకు చేర్చాడనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కనుందట. ఈ బయోపిక్‌లో లాలా అమర్‌నాథ్ పాత్రలో ఆమిర్‌ఖాన్ కనిపించబోతుండగా...పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా ఫర్హాన్ అక్తర్ నటించనున్నట్లు సమాచారం.
అక్టోబర్‌లో సెట్స్‌పైకి...
లగాన్ తర్వాత దాదాపు ఇరవై ఐదేళ్ల విరామం అనంతరం ఆమిర్‌ఖాన్, అషుతోష్ గోవారికర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్‌పైకి రానుందట. ఫర్హాన్ అక్తర్‌తో కలిసి ఆమిర్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఈ బయోపిక్‌ను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాలా అమర్‌నాథ్ బయోపిక్‌తో పాటు త్రీ ఇడియట్స్ సీక్వెల్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ – లీడ్ రోల్‌లో కుబేర విలన్ – ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మే 26, 2026

Krystle D’Souza | పీకల్లోతు ప్రేమలో దురంధర్ బ్యూటీ.. దుబాయి బిలియనీర్‌తో డేటింగ్..!
మే 26, 2026

Ranveer Singh | డాన్-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్వీర్ సింగ్..!
మే 26, 2026
తాజావార్తలు
- ●Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!
- ●Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య
- ●Smart Phones | ఫోన్ మరీ అతిగా హీట్ అవుతుందా.. వేసవిలో ఫోన్ పట్ల ఈ జాగ్రత్తలు పాటించండి..
- ●N Ramachander Rao | తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం : ఎన్ రామచందర్ రావు
- ●Tappachabutra Police | కరెంటు షాక్‌తో పడిపోయాడు.. పోలీసులొచ్చి సీపీఆర్ చేశారు.. తర్వాత ఏమైందంటే!
- ●Pinarayi Vijayan ED Raids | పినరయి విజయన్‌పై ఈడీ ఫోకస్ వెనుక అసలు కథ ఇదేనా? కాంగ్రెస్, బీజేపీలపై సీపీఎం సంచలన ఆరోపణలు!

Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!

Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య

Smart Phones | ఫోన్ మరీ అతిగా హీట్ అవుతుందా.. వేసవిలో ఫోన్ పట్ల ఈ జాగ్రత్తలు పాటించండి..

N Ramachander Rao | తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం : ఎన్ రామచందర్ రావు



