Zayn Marie Khan | అడివి శేష్ సినిమాలో ఆమిర్‌ఖాన్ మేనకోడలు – టాలీవుడ్‌లో తొలి అడుగు
ఆమిర్‌ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అడివిశేష్ డెకాయిట్ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Entertainment | Published On Mar 21, 2026, 7.04 pm IST
Zayn Marie Khan | పాన్ ఇండియన్ కల్చర్‌తో టాలీవుడ్ క్రేజ్ పెరిగింది. తెలుగు సినిమాల్లో భాగమయ్యేందుకు తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్ యాక్టర్లు ఆసక్తిని చూపుతున్నారు. స్టార్ హీరోహీరోయిన్లు సైతం తెలుగులో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆమిర్‌ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
డెకాయిట్‌తో...
అడివిశేష్ హీరోగా నటిస్తోన్న డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆమిర్‌ఖాన్ మేనకోడలు...
డెకాయిట్‌లో బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్‌ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఈ సినిమాలో జానకి అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నది. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రివాల్వర్ గురిపెట్టి జైన్ మేరీ ఖాన్ కనిపిస్తోంది. డెకాయిట్‌లో నిజాయితీపరురాలైన పవర్‌ఫుల్ పోలీస్‌గా ఆమిర్‌ఖాన్ మేనకోడలు పాత్ర సాగుతుందని అంటున్నారు.
హిందీలో...
జైన్ మేరీఖాన్‌కు ఇదే తొలి తెలుగు మూవీ కావడం గమనార్హం. హిందీలో మిస్టర్ సీరియల్ కిల్లర్‌తో పాటు మోనికా ఓ మై డార్లింగ్ అనే సినిమాలు చేసింది జైన్ మేరీ ఖాన్. మేడిన్ హెవెన్, ఇల్లీగల్‌తో పాటు మరో రెండు వెబ్ సిరీస్‌లలో నటించింది.
సాయిపల్లవి బాలీవుడ్ మూవీ...
జైన్ మేరీ ఖాన్ తండ్రి మన్సూర్ ఖాన్ బాలీవుడ్‌లో దర్శకనిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహీ సికందర్‌తో పాటు ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌తో కలిసి మన్సూర్ ఖాన్ ఏక్‌దిన్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రేమకథా చిత్రంతోనే సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మే 1న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026

Rahul Ramakrishna | భ్రమల నుంచి బయటకు రాకపోతే …ఖాళీ థియేటర్లే గతి – రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
మే 12, 2026

Dimple Hayathi | మందారం…బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ …భోగి నుంచి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ అదిరిందిగా!
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



