Aamir Khan | లిప్‌లాక్ సీన్ కోసం 47 రీటేక్స్ తీసుకున్న ఆమిర్‌ఖాన్ – మూడు రోజులు షూటింగ్ – ఆ సినిమా ఏదంటే?
ఆమిర్‌ఖాన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమాల్లో రాజా హిందుస్థానీ ఒకటి. 1996లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ఓ లిప్‌లాక్ సీన్ కోసం ఆమిర్‌ఖాన్ ఏకంగా 47 రీటేక్స్ తీసుకున్నారట.
Entertainment | Published On Mar 14, 2026, 1.00 pm IST
Aamir Khan |బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌ను మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పిలుస్తుంటారు. కథ పాత్రల కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు ఆమిర్‌ఖాన్. నటుడిగా ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు తాపత్రయపడుతుంటారు. కేవలం నటనకే పరిమితం కాకుండా ఓ సినిమా బాగా రావడం కోసం స్క్రిప్ట్, షూటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్...ఇలా ప్రతి విభాగంలో ఆయన ఇన్‌వాల్వ్ అవుతుంటారు. చిన్న సీన్ అయినా సహజత్వం కోసం ఎంతో రీసెర్చ్ చేస్తుంటారని ఆమిర్ ఖాన్‌తో పనిచేసిన దర్శకులు అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటారు.
ఐదు కోట్ల బడ్జెట్....76 కోట్ల కలెక్షన్స్...
ఆమిర్ పర్‌ఫెక్షన్‌కు రాజా హిందుస్థానీ సినిమాలోని ఓ లిప్‌లాక్ సీన్‌ను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇప్పటికీ చెబుతుంటారు. ఆమిర్‌ఖాన్ కెరీర్‌ను మలుపుతిప్పడమే కాకుండా అతడికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా రాజా హిందుస్థానీ నిలిచింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 76 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాలో కరిష్మా కపూర్ హీరోయిన్‌గా నటించింది.
మూడు రోజుల షూటింగ్...
రాజా హిందుస్థానీ సినిమాలో ఓ లిప్‌లాక్ సీన్ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం 30 సెకండ్ల నిడివితో కూడిన ఈ లిప్‌లాక్ సీన్ కోసం మూడు రోజులు షూటింగ్ చేశారట. అంతే కాదు ఈ ముద్దు సన్నివేశం కోసం ఆమిర్‌ఖాన్, కరిష్మాకపూర్ ఏకంగా 47 రీటేక్స్ తీసుకున్నారట.అశ్లీలంగా, అసభ్యంగా ఉందనే ఫీల్ ఆడియెన్స్‌లో రాకుండా...హీరోహీరోయిన్ల మధ్య గాఢమైన ప్రేమను చాటిచెప్పేలా ఈ సీన్ ఉండాలని డైరెక్టర్ ధర్మేష్ దర్శన్ భావించారట. ఆ ఫీల్ నాచురల్‌గా వచ్చే వరకు మూడు రోజుల పాటు ఒకే లిప్‌లాక్ సీన్‌ను షూట్ చేశారట.
ఫిబ్రవరి నెలలో...
ఈ లిప్‌లాక్ సీన్‌ను ఊటీలో షూట్ చేశారట. అది కూడా ఫిబ్రవరి నెలలో...వర్షం ఎఫెక్ట్‌తో చిత్రీకరించాట. ఈ సీన్‌ను కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామని గతంలో ఆమిర్‌ఖాన్, కరిష్మాకపూర్ చాలా సందర్భాల్లో చెప్పారు.వారి కష్టం వృథా కాలేదు. అప్పట్లో ఆ ముద్దు సీన్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
రాజా హిందుస్థానీ మూవీ ప్రేమ బంధం పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను రాబట్టింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



