Shambhala OTT | ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు హారర్ మూవీ – వంద మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్
ఆది సాయికుమార్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ శంబాల ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ పది రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్ వ్యూస్‌ను దాటేసింది. శంబాల మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Feb 2, 2026, 2.08 pm IST
Shambhala OTT | శంబాల మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత పెద్ద హిట్టు అందుకున్నాడు ఆది సాయికుమార్. హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించింది. ఓటీటీలోనూ శంబాల అదరగొడుతోంది. రికార్డ్ వ్యూస్‌తో కుమ్మేస్తోంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న శంబాల మూవీ పది రోజుల్లోనే వంద మిలియిన్ల స్ట్రీమింగ్ మినట్ వ్యూస్‌ను దాటేసింది. ఆహా ఓటీటీలో అతి తక్కువ టైమ్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తెలుగు మూవీగా శంబాల రికార్డ్ క్రియేట్ చేసింది.
అర్చనా అయ్యర్ హీరోయిన్...
శంబాల మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చనా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మధునందన్, రవి వర్మ, స్వాసిక కీలక పాత్రల్లో నటించారు. మైథాలజీ అంశాలకు హారర్, మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు యుగంధర్ మూవీ ఈ సినిమాను తెరకెక్కించారు.
పది కోట్ల బడ్జెట్ - ఇరవై ఐదు కోట్ల కలెక్షన్స్...
కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్, ఆది సాయికుమార్ యాక్టింగ్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. హారర్, మైథాలజీ ఎలిమెంట్స్‌ను డైరెక్టర్ బ్యాలెన్స్ చేసిన తీరు బాగుందని అన్నారు.
శంబాల మిస్టరీ...
శంబాల అనే పల్లెటూరిలో ఆకాశం నుంచి ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడినప్పటి నుంచి ఊరిలో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఆ ఊరి ప్రజలు ఒకరి తర్వాత మరొకరు మరణిస్తుంటారు. ఊరిలో పడిన ఉల్క కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని స్వామిజీ చెప్పడంతో ప్రజల్లో భయం మొదలవుతుంది. ఆ ఉల్క గురించి పరిశోధన చేయడానికి విక్రమ్ (ఆది సాయికుమార్) అనే సైంటిస్ట్ శంబాలలో అడుగుపెడతాడు. వస్తాడు. విక్రమ్ పరిశోధనలో ఆ ఉల్క గురించి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఆ ఊరిని ఆవహించిన ఆత్మ కథేమిటి? ఆ ఆత్మ మిస్టరీని ఛేదించడంలో విక్రమ్‌కు అండగా నిలిచిన దేవి (అర్చనా అయ్యర్) ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
శంబాల తర్వాత ఇన్స్‌పెక్టర్ యుగంధర్ పేరుతో ఓ క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు ఆది సాయికుమార్. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






