త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | తెలుగులో రిలీజైన త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – ఏ ఓటీటీలో చూడాలంటే?

ఆది పినిశెట్టి హీరోగా న‌టించిన త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ శ‌బ్దం తెలుగులో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వైశాలి ఫేమ్ అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ల‌క్ష్మీమీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Apr 10, 2026, 8.23 pm IST

Telugu OTT | తెలుగులో రిలీజైన త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – ఏ ఓటీటీలో చూడాలంటే?
Advertisement

Telugu OTT |ఆది పినిశెట్టి హీరోగా న‌టించిన త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ శ‌బ్దం విభిన్న‌మైన ప్ర‌య‌త్నంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ల‌క్ష్మీమీన‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో సీనియ‌ర్ క‌థానాయిక‌లు సిమ్రాన్‌, లైలా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

జీ5 ఓటీటీలో....

తాజాగా ఈ త‌మిళ హార‌ర్ మూవీ తెలుగులోనూ రిలీజైంది. శుక్ర‌వారం నుంచి జీ5 ఓటీటీలో శ‌బ్దం తెలుగు వెర్ష‌న్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

త‌మ‌న్ మ్యూజిక్‌....

శ‌బ్దం సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. శ‌బ్దం కంటే ముందు ఆది పినిశెట్టి, డైరెక్ట‌ర్ అరివ‌ళ‌గ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వైశాలి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వైశాలి త‌ర‌హాలోనే ఈ సినిమా కూడా భ‌య‌పెడుతుంద‌ని ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. యూనిక్ పాయింట్‌తో ద‌ర్శ‌కుడు అరివ‌గ‌ళ‌న్ శ‌బ్ధం క‌థ‌ను రాసుకున్నారు. కానీ ప్ర‌జెంటేష‌న్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద‌ యావ‌రేజ్‌గా నిలిచింది.

మెడిక‌ల్ కాలేజీలో ఆత్మ‌లు...

వ్యోమ వైద్య‌లింగం ఘోస్ట్ ఇన్వేస్టిగేట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ద‌య్యాలు ఉన్నాయో లేదో క‌నిపెట్ట‌డం అత‌డి వృత్తి. కేర‌ళ‌లోని ఓ మెడిక‌ల్ కాలేజీలో స్టూడెంట్స్ వ‌రుస‌గా చ‌నిపోతుంటారు. ఈ మిస్ట‌రీని ఛేదించ‌డానికి వైద్య‌లింగం రంగంలోకి దిగుతాడు. కాలేజీలోని లైబ్ర‌రీలో 42 ఆత్మ‌లు ఉన్నాయ‌ని వైద్య‌లింగం ఇన్వేస్టిగేష‌న్‌లో తేలుతుంది. ఆ ఆత్మ‌లు కాలేజీలో ప‌నిచేసే అవంతిక‌ను ఎందుకు వెంటాడుతున్నాయి? కాలేజీ ఓన‌ర్ డ‌యానా కోమాలోకి వెళ్ల‌డానికి కార‌ణం ఏమిటి? నాన్సీ డేనియ‌ల్ ఎవ‌రు అనే అంశాల‌తో డైరెక్ట‌ర్ శ‌బ్ధం మూవీని తెర‌కెక్కించారు డైరెక్టర్.

ఆది పినిశెట్టి కెరీర్ తెలుగు సినిమాల‌తోనే మొద‌లైంది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక విచిత్రం సినిమాతో హీరోగా మారాడు. తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ‌గా అవ‌కాశాల‌తో పాటు విజ‌యాలు ద‌క్కాయి. తెలుగులోనూ హీరోగానే కాకుండా స‌రైనోడు, అఖండ 2, అజ్ఞాత‌వాసి సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు. ప్ర‌స్తుతం హార‌ర్ కామెడీ క‌థ‌తో మ‌ర‌క‌త‌మ‌ణి 2 సినిమా చేస్తోన్నాడు ఆది పినిశెట్టి.

 

Advertisement
Advertisement