త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీలోకి – టాలీవుడ్‌లో కొత్త రూల్‌

థియేట్రిక‌ల్ ఓటీటీ రిలీజ్ మ‌ధ్య గ్యాప్‌పై ఫిలిం ఛాంబ‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్టార్ హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీలోకి తీసుకురావాల‌నే రూల్‌ను ఖ‌చ్చితంగా అంద‌రూ పాటించాల‌ని బుధ‌వారం ఏర్పాటుచేసిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో ప్ర‌తిపాదించిన‌ట్లు తెలిసింది.

N

Entertainment | Published On Feb 26, 2026, 5.00 pm IST

OTT | థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీలోకి – టాలీవుడ్‌లో కొత్త రూల్‌
Advertisement

OTT |  ఓటీటీ ట్రెండ్ కార‌ణంగా థియేట‌ర్ల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌నే వాద‌న చాలా రోజులుగా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. స్టార్ హీరోలు న‌టించిన సినిమాలు సైతం నాలుగూ వారాల్లోనే ఓటీటీల‌లోకి వ‌స్తుండ‌టంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఆడియెన్స్ సంఖ్య రానురాను త‌గ్గిపోతుంది. అదే మిడ్‌రేంజ్‌, చిన్న హీరోలు న‌టించిన సినిమాలైతే రెండు నుంచి మూడు వారాల్లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. దాంతో ఓటీటీల‌లో రిలీజైన త‌ర్వాతే సినిమా చూద్దామ‌నే ఆలోచ‌న‌తో ఆడియెన్స్ థియేట‌ర్ల వైపు వెళ్ల‌డ‌మే మానేశారు. సింగిల్ స్క్రీన్స్ థియేట‌ర్ల సంఖ్య రాను రాను త‌గ్గిపోతుంది. ఇలాగైతే థియేట‌ర్ల వ్య‌వ‌స్థ క‌నుమ‌రుగైపోతుందంటూ ప‌లువురు డిస్ట్రిబ్యూట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గుడ్‌న్యూస్‌...

థియేట్రిక‌ల్‌, ఓటీటీ రిలీజ్ మ‌ధ్య గ్యాప్ పెంచాలంటూ గ‌త కొద్ది రోజులుగా డిస్ట్రిబ్యూట‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో పాటు థియేట‌ర్ వ‌ర్గాల‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ గుడ్‌న్యూస్ వినిపించింది. స్టార్ హీరోలు న‌టించిన సినిమాల‌ను థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీలోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. థియేట్రిక‌ల్‌, ఓటీటీ రిలీజ్ గ్యాప్‌పై బుధ‌వారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఓటీటీపైనే చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఓటీటీ రిలీజ్ డేట్‌ ఈ రూల్‌ను టాలీవుడ్‌లోని నిర్మాత‌లంతా ఖ‌చ్చితంగా పాటించేలా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తీసుకురాబోతున్న‌ట్లు చెబుతున్నారు. మిడ్‌రేంజ్‌, చిన్న హీరోల సినిమాల విష‌యంలో 56 రోజుల రూల్ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అలాగే ఇప్ప‌టికే 60 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకున్న పెద్ద హీరోల సినిమాల‌కు కూడా ఎనిమిది వారాల రూల్ వ‌ర్తించ‌ద‌ని పేర్కొన్న‌ట్లుత ఎలిసింది.

ప్రొడ్యూసర్ కౌన్సిల్...

తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌తో పాటు యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ పంపించిన‌ట్లు స‌మాచారం. వారు ఆమోదం తెలిపిన త‌ర్వాతే ఈ ఎనిమిది వారాల రూల్‌ను అమ‌లులోకి తీసుకురాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement