త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

భాగ్య‌శ్రీ బోర్సే ఫ్లాప్‌ల‌కు పుల్‌స్టాప్ ప‌డేదెప్పుడూ? – అక్కినేని హీరోపైనే ఆశ‌లు పెట్టుకున్న బ్యూటీ!

N

Entertainment | Published On Dec 6, 2025, 7.27 am IST

భాగ్య‌శ్రీ బోర్సే ఫ్లాప్‌ల‌కు పుల్‌స్టాప్ ప‌డేదెప్పుడూ? – అక్కినేని హీరోపైనే ఆశ‌లు పెట్టుకున్న బ్యూటీ!

భాగ్యశ్రీ బోర్సే

Advertisement

హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభిన‌యం మాత్ర‌మే స‌రిపోవు. అవ‌గింజంత అదృష్టం కూడా ఉండాలి. యాక్టింగ్ టాలెంట్ లేక‌పోయినా ల‌క్ క‌లిసి రావ‌డంతో టాప్ హీరోయిన్లుగా మారిపోయిన‌వాళ్లు చాలా మందే ఉన్నారు. టాలెంట్ బోలెడు ఉండి కూడా అదృష్టం క‌లిసిరానివాళ్లు కూడా క‌నిపిస్తుంటారు. భాగ్య‌శ్రీ బోర్సే రెండో కోవ‌కు చెందుతుంది.
ర‌వితేజ హీరోగా న‌టించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయినా భాగ్య‌శ్రీ బోర్సే పేరు మాత్రం టాలీవుడ్‌లో తెగ వినిపించింది. ఇంద‌లో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ముద్దుగుమ్మ‌కు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి.
విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్‌, దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత సినిమాల‌తో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న రోల్స్‌కు న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని నిరూపించుకుంది భాగ్య‌శ్రీ. కాంత‌లో కుమారి అనే అల‌నాటి హీరోయిన్ పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.
రామ్ ఆంధ్ర కింగ్ తాలూకాతో కెరీర్‌లో ఫ‌స్ట్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ఆశ‌ప‌డింది భాగ్య‌శ్రీ బోర్సే. ఇందులోనూ మ‌హాల‌క్ష్మి అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. సినిమా కాన్సెప్ట్‌తో పాటు రామ్‌, భాగ్య‌శ్రీ యాక్టింగ్‌కు మంచి పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. దాదాపు 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు యాభై శాతం మాత్ర‌మే రిక‌వ‌రీ సాధించింది. ఆంధ్ర కింగ్ తాలూకా లాభాల్లోకి అడుగుపెట్ట‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు. ఈ మూవీతో వ‌రుస‌గా ఈ ఏ డాది మూడో డిజాస్ట‌ర్ భాగ్య‌శ్రీ ఖాతాలో ప‌డింది.
ఆంధ్ర‌ కింగ్ తాలూకా త‌ర్వాత లెనిన్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తున్న ఈ మూవీకి ముర‌ళీకృష్ణ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో లెనిన్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భాగ్య‌శ్రీ ఆశ‌ల‌న్నీ ఆధార‌ప‌డ్డాయి. క‌నీసం లెనిన్‌తోనే తొలి విజ‌యం ఆమెకు ద‌క్కుతుందా? లేదా? అన్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు అఖిల్‌కు కూడా ఈ మూవీ స‌క్సెస్ కీల‌కంగా మారింది. హీరోగా ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు అయినా ఒక్క హిట్టు కొట్ట‌లేదు. ఈ ఇద్ద‌రికి లెనిన్ ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుంద‌న్న‌ది వ‌చ్చే ఏడాది తేల‌నుంది.
లెనిన్‌లో తొలుత శ్రీలీల‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొద్ది రోజుల షూటింగ్ త‌ర్వాత డేట్స్ ఇష్యూస్‌తో శ్రీలీల ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది. ఆమె ప్లేస్‌లో భాగ్య‌శ్రీ సినిమాలోకి అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం లెనిన్ షూటింగ్‌తో భాగ్య‌శ్రీ బిజీగా ఉంది. లెనిన్ మూవీని అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement