త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పేరుకే చిన్న సినిమాలు – లాభాలు బోలెడు – ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన “లో” బ‌డ్జెట్ మూవీస్ ఇవే!

N

Entertainment | Published On Dec 4, 2025, 5.43 am IST

పేరుకే చిన్న సినిమాలు – లాభాలు బోలెడు – ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన “లో” బ‌డ్జెట్ మూవీస్ ఇవే!
Advertisement

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద గ‌త కొన్నేళ్లుగా స్టార్ హీరోల‌దే డామినేష‌న్ క‌నిపిస్తోంది. అల్లు అర్జున్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్‌ సినిమాలు వంద‌ల నుంచి వేల కోట్ల‌ వ‌సూళ్ల‌తో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్నాయి. నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తున్నాయి. కానీ 2025లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. స్టార్ హీరోలు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డ్డాయి. మ‌రోవైపు ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను పండించాయి. 2025లో భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టిన చిన్న సినిమాలు ఏవంటే?
రాజు వెడ్స్ రాంబాయి...
కంటెంట్ బాగుంటే కొత్త‌, పాత హీరోహీరోయిన్లు అనే తేడాలు లేకుండా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని రాజు వెడ్స్ రాంబాయి మ‌రోసారి నిరూపించింది. అఖిల్, తేజ‌స్వి రావ్ నాయ‌కానాయిక‌లుగా సాయిలు కంపాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు ప‌దిహేను కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో హ‌ర్ట్ హిట్టింగ్ విలేజ్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు సాయిలు కంపాటి ఈ సినిమాను తెర‌కెక్కించారు. స్టోరీ, క్లైమాక్స్‌తో పాటు హీరోహీరోయిన్ల యాక్టింగ్‌కు ఆడియెన్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. రిలీజై 12 రోజులు దాటినా ఇప్ప‌టికీ ఈ మూవీ హౌజ్‌ఫుల్స్‌తో న‌డుస్తోంది. నిర్మాత‌ల‌కు ఈ మూవీ ప‌ది కోట్లకుపైనే లాభాల‌ను మిగిల్చిన‌ట్లు స‌మాచారం.
లిటిల్ హార్ట్స్‌...
లిటిల్ హార్ట్స్ మూవీ 2025లో అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన మూవీగా నిలిచింది. మౌళి త‌నూజ్‌, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించింది. కేవ‌లం మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా న‌ల‌భై కోట్ల వ‌సూళ్ల‌తో దుమ్మురేపింది. కోచింగ్ సెంట‌ర్‌లో ప్రేమ‌లో ప‌డ్డ ఓ జంట క‌థ‌తో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు సాయి మార్తాండ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. క‌థ పాత‌దే అయినా కామెడీతో మ్యాజిక్ చేసి హిట్టు కొట్టాడు.
హీరో నాని నిర్మాత‌గా...
నాచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం 5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 58 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో ప్రియ‌ద‌ర్శి, శ్రీదేవి, హ‌ర్ష్ రోష‌న్‌, శివాజీ కీల‌క పాత్ర‌లు పోషించారు. శుభం సినిమాతో హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారింది. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిన్న సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకుంది స‌మంత‌. ఈ ఏడాది రిలీజైన పాంచ్‌మినార్‌, కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు, లెవెన్ లాంటి చిన్న‌ సినిమాలు మంచి ప్ర‌య‌త్నాలుగా నిలిచాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement