Vastu Tips | ఈ నాలుగు మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. కోటీశ్వరులైపోతారట..!
Vastu Tips | అప్పులతో( Debts ) బాధపడుతున్నారా..? వడ్డీలు కట్టలేక ఆగమైపోతున్నారా..? అయితే ఈ నాలుగు మొక్కలు( Plants ) మీ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే.. అప్పుల నుంచి ఉపశమనం పొంది రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యే అవకాశం ఉందని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు.
Devotional | Published On Sep 17, 2026, 6.08 am IST
Vastu Tips | మీరు ఆర్థిక సమస్యలతో( Financial Problems ) సతమతమవుతున్నారా..? అప్పులు( Debts ) మోపెడై కూర్చున్నాయా..? అప్పుల ఊబి నుంచి ఊపిరి పీల్చుకోలేకపోతున్నారా..? అయితే మీరు వాస్తు నియమాలు( Vastu Tips ) తప్పక పాటించాల్సిందేనని వాస్తు పండితులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు తమ ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నాలుగు మొక్కలు కూడా శుభప్రదమని చెబుతున్నారు. మరి ఆ నాలుగు మొక్కలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
తులసి మొక్క

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి మహిళ తులసి మొక్కకు ఉదయాన్నే పూజలు నిర్వహిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూలతలు తగ్గి ఆర్థిక సమస్యలు కూడా సమసిపోయే అవకాశం ఉంది. వాస్తు దోషాలు తొలగిపోయి కుబేరులు అయ్యే అవకాశం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు.
మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ కూడా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం వల్ల అప్పులు తగ్గి.. అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం ఉందట. మనీ ప్లాంట్ ఇంట్లో ఎంత పెరిగితే అంత సంపద పెరిగి.. సానుకూలత పెరుగుతుందని వాస్తు పండితులు పేర్కొంటున్నారు.
తమలపాకు మొక్క

తమల పాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తమలపాకు మొక్క ఉండడం వల్ల ఆ ఇంటికి ఏమన్న నరదిష్టి ఉన్న తొలగిపోతుందట. దాంతో ఆర్థిక సమస్యలు, ఇతర ఇబ్బందులు తొలగిపోయి కోటీశ్వరులకు సమానంగా ఎదుగుతారట. మరి ముఖ్యంగా ఆర్థిక సానుకూలతను పెంపొందించి.. అప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వాస్తు పండితులు పేర్కొంటున్నారు.
లక్కీ బాంబు

ఇంటిలో లక్కీ బాంబు మొక్క ఉండటం చాలా మంచిదట. ఇది ఇంట్లో సిరిసంపదలను కురిపిస్తుందంట. ఎవరి ఇంటిలో అయితే ఈ మొక్క ఉంటుందో, వారికి డబ్బుకు కొదవే ఉండదట. అందువలన ఈ మొక్క ఇంట్లో ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
తాజావార్తలు
- ●Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక నష్టాలు..!
- ●22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు

Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక నష్టాలు..!

22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!






