Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
Vastu Tips | మీ ఇంట్లో చీపురు కట్ట( Broom ) ఉందా..? అది కూడా కిచెన్( Kitchen )లో పెడుతున్నారా..? అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్టే.. లక్ష్మీదేవి( Lakshmi Devi )కి ఆగ్రహం తెప్పించే పని చేస్తున్నట్టే.. ఎందుకో తెలుసా..?
Devotional | Published On Aug 7, 2026, 6.21 am IST
Vastu Tips | త్రినేత్ర.న్యూస్ : ఇల్లు లేని చీపురు( Broom ) ఉండకపోవచ్చు.. ఎందుకంటే పొద్దుకు రెండు, మూడు సార్లు ఇంటిని శుభ్రపరిచేందుకు చీపురును వినియోగిస్తాం. ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచే చీపురు పట్ల కొందరు నిర్లక్ష్యం వహిస్తుంటారు. లక్ష్మీదేవి( Lakshmi Devi ) స్వరూపంగా భావించే చీపురుకు వాస్తు శాస్త్రం( Vastu )లో ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలా మంది చీపురును వంట గది( Kitchen )లో పెడుతుంటారు. ఇలా వంట గదిలో చీపురును పెట్టొచ్చా..? పెడితే ఏమవుతుంది..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో చీపురు కట్టను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఇంటిని శుభ్రపరించేందుకు వినియోగించే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. చీపురు విషయంలో నిర్లక్ష్యం వహించినా, అశ్రద్ధ వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆ ఇంట్లో ధన నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన చీపురును వంట గదిలో పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు.
చాలా మంది ఇల్లును శుభ్రపరిచిన తర్వాత చీపురును తీసుకెళ్లి ఇంట్లోని ఏదో ఒక మూలకు పెడుతుంటారు. కొందరైతే కిచెన్‌లో పడేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమట. వంట గదిలో చీపురు ఉంచితే.. ఆ ఇంట్లో ఉన్న ధనం తెలియకుండానే ఆవిరైపోతుందట. ఇక డబ్బులు, నగలు భద్రపరిచే స్థలంలో కూడా చీపురు ఉంచొద్దని అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. కాబట్టి చీపురును వంటగదికి, నగలు, నగదు భద్రపరిచే స్థలానికి దూరంగా ఉంచాలని పండితులు సూచిస్తున్నారు.
చీపురుకట్టను ఏ రోజు కొనుగోలు చేస్తే మంచిది..?
చీపురుకట్టను కొనేందుకు కూడా ఒక రోజు ఉందనేది గ్రహించాలి. ఏ రోజు పడితే ఆ రోజు చీపురును కొంటే.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. శని, మంగళవారాల్లో చీపురుకట్టను అసలు కొనుగోలు చేయకూడదట. బుధ, గురు, శుక్రవారాల్లో కొంటే.. లక్ష్మీదేవి శాంతించి.. ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి
- ●Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..

MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం






