Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
Navaratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం రాత్రి గజవాహనంపై మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గజరాజుల ముందంజ, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా సాగింది.
Devotional | Published On Oct 17, 2026, 9.27 pm IST
Navaratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం రాత్రి గజవాహనంపై మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గజరాజుల ముందంజ, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా సాగింది. భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణాలతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గజవాహనంపై ఊరేగుతున్న స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణతో శ్రీవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
టీటీడీ గజరాజులు సైతం సేవలో పాల్గొని ఉత్సవానికి మరింత శోభను తీసుకొచ్చాయి. రాజ వైభవానికి, గౌరవ మర్యాదలకు ప్రతీకగా నిలిచే గజవాహనంపై స్వామివారి దర్శనం సకల పాపాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గజవాహనసేవను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vijay - Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...

ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..



